Breaking News

Akhil-Zianab : జైనాబ్‌ డైమండ్‌ జ్యుయల్లరీ స్పెషల్‌ ఎట్రాక్షన్‌

Published on Sat, 06/07/2025 - 16:43

అక్కినేని కుటుంబం మొత్తానికి  అఖిల్ అక్కినేని ,  జైనాబ్ రవ్జీ  మూడు ముళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో(జూన్ 6న)వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్‌ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున-అమల,  సవతి సోదరుడు నాగ చైతన్య -శోభిత ధూళిపాళ దంపతులు దగ్గరుండి వీరి పెళ్లి వేడుకను  వైభవంగా జరిపించారు.  అఖిల్‌-జైనాబ్‌  వెడ్డింగ్‌ పిక్స్‌ నెట్టింట సందడిగా మారాయి. అలాగే వధువు జైనాబ్‌ చీర, నగలపై ఆసక్తి నెలకొంది.

వధువు జైనాబ్ వజ్రాభరణాలతో అందంగా మెరిసిపోయింది. జైనాబ్ ముఖంలో ఐవరీ-గోల్డ్ చీర, జడలో  మల్లె పూలతో పెళ్లి కళ ఉట్టి పడింది. అలాగే  పెళ్లి  ముస్తాబులో మొత్తం డైమండ్‌ నగలనే ఎంచుకోవడం స్పెషల్‌ ఎట్రాక్షన్‌. వజ్రాల ఆభరణాలతో తన బ్రైడల్‌ లుక్‌ను తీర్చిదిద్దుకుంది. రెడ్‌ రూబీ పొదిగిన డైమండ్ చోకర్ నెక్‌పీస్ అందంగా అమిరింది. దీంతోపాటు మ్యాచింగ్‌ చైన్‌, మూడు లేయర్ల  డైమండ్ నెక్లెస్, మఠపట్టి, మ్యాచింగ్ ఝుమ్కాలు,  ముక్కెర, వజ్రాల గాజులు, డైమండ్‌ వడ్డాణం ఇలా ప్రతీదీ డైమండ్స్‌తో  తళుక్కున మెరిసింది. అటు  కొత్త పెళ్లికొడుకు అఖిల్‌ కూడా శ్వేత వస్త్రాల్లో  సింపుల్‌గా అందంగా కనిపించాడు.

జైనబ్‌తో  తన రిలేషన్‌షిప్‌ను అఖిల్‌ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రెండు ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు జైనబ్‌  డైమండ్‌ రింగ్‌ను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కినేని నాగార్జున  తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు. 

 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)