Breaking News

నాన్‌వెజ్‌ తినొద్దని వేధించి..

Published on Wed, 11/27/2024 - 17:31

ఎయిరిండియా పైలట్‌  అనుమానాస్పద కలకలం రేపింది. దీనికి ఆమె బాయ్‌ ఫ్రెండే కారణమని బంధువులు ఆరోపించారు. దీంతో పోలీసులు  అతడిని అరెస్ట్‌  చేశారు.  పూర్తి వివరాలు..

ఎయిరిండియాలో పైలట్‌గా పనిచేస్తున్న 25ఏళ్ల సృష్టి తులి ఈనెల 25న ముంబైలోని అంధేరీ ఈస్ట్‌లోని ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.  అయితే  ఆదిత్య పండిట్‌ తరచూ ఆమెను వేధించేవాడని, ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించేవాడని సృష్టి కుటుంబం ఆరోపించింది. నాన్‌ వెజ్‌ తినవద్దు అంటూ కట్టడి చేసేవాడని తెలిపింది.  అతనే హత్య చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. దీంతో నవంబర్ 26న కేసు నమోదు చేసిన పోలీసులు పండిట్‌ను అరెస్టు చేశారు. కోర్టు అతడిని నవంబర్ 29 వరకు పోలీసు కస్టడీకి పంపింది. 

పోలీసుల  సమాచారం ప్రకారం  ఆమె మృతదేహానికి సమీపంలో లేదా ఆమె ఫ్లాట్‌లో ఎలాంటి సూసైడ్ నోట్‌ లభించలేదు. సృష్టి కమర్షియల్‌ పైలట్‌. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఆమె గత ఏడాది జూన్ నుంచి ఉద్యోగ నిమిత్తం ముంబైలో నివసిస్తోంది. రెండేళ్ల క్రితం కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ కోసం శిక్షణ పొందుతున్న సమయంలో సృష్టి, పండిట్‌లు ఢిల్లీలో కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారింది. అయితే ఈ ట్రైనింగ్‌లో ఆదిత్య పండిట్ పైలట్‌గా ఎంపిక కాలేదు.

ఘటనకు ముందు దాదాపు ఐదు నుంచి ఆరు రోజుల పాటు పండిట్ సృష్టితో కలిసి అంధేరి ఫ్లాట్‌లో ఉన్నాడు. సోమ‌వారం (నవంబర్ 25) అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత‌ అతను కారులో ఢిల్లీకి బయలుదేరాడు. ఈ సమయంలో సృష్టి అతనికి ఫోన్ చేసి, ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అతడు ముంబైకి తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ చేసి ఉంది. ఎంత పిలిచినా తీయకపోవడంతో ఆమె స్నేహితురాలు ఉర్వి పంచల్‌ను సంప్రదించి,  కీమేకర్‌ సాయంతో తలుపు తెరిచారు. కానీ అప్పటికే కేబుల్‌ వైర్‌తో ఉరి వేసుకుంది. అంధేరీ ఈస్ట్‌లోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా,  ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

సృష్టి మామ ఆరోపణలు
'పండిట్‌ను సృష్టి చాలా గాఢంగా ప్రేమించింది. కానీ అతడు ఆమెను బాగా  వేధించేవాడు. బహిరంగంగా దుర్భాషలాడేవాడు. మాంసాహారం తినడం మానేయాలని కూడా ఒత్తిడి చేశాడు. ఆమె పట్ల పండిట్ అసభ్యంగా ప్రవర్తించడం ఇతర బంధువులు కూడా చూశారు. అలాగే ఒక పార్టీలో మాంసాహారం తిన్నందుకు అందరిముందూ అరిచాడు. ఆమె కారును పాడు చేసి, రోడ్డుపై ఒంటరిగా వదిలేసివెళ్లిపోయాడు. ఇటీవల పండిట్ సోదరి నిశ్చితార్థం ఫంక్షన్‌కు సృష్టి వెళ్లలేకపోవడంతో దాదాపు 10 రోజుల పాటు మాట్లాడలేదు.  దీంతో సృష్టి మానసికంగా కృంగి పోయింద‌'ని సృష్టి మామ ఆరోపించారు.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)