Breaking News

ఉన్నత చదువులకు ఫస్ట్‌ ఫ్లైట్‌ అదే లాస్ట్‌..: ఆటో డ్రైవర్‌ కుమార్తె విషాదాంతం

Published on Sat, 06/14/2025 - 15:17

Air India Plane Crash : అహ్మదాబాద్ నుండి లండన్ గాట్విక్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఒక్కొక్కరిదీ ఒక్కో  విసాదం.  ఉన్నత చదువులు చదివి, కుటుంబాన్ని ఆదుకోవాలని   కోటి ఆశలతో తొలిసారి విమానం ఎక్కిన ఒక ఆటో డ్రైవర్‌ కుమార్తె ప్రాణాలు కోల్పోయిన ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది

గుజరాత్‌లోని హిమత్‌నగర్‌కు చెందిన పాయల్ ఖాతిక్ (Payal Khatik)  తొలిసారి విమానం ఎక్కింది. భవిష్యత్‌ కలలతో ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా బయలుదేరింది. కానీ అదే అదే చివరికి అవుతుందని  అస్సలు ఊహించలేదు. ఆమె తండ్రి లోడింగ్ రిక్షా నడుపుతాడు. MTech చదవడానికి లండన్ వెళ్లేందుకు గురువారం ఉదయం  ఉత్సాహంగా బయలుదేరింది. నిజం చెప్పాలంటే ఆ కుటుంబంలో విమానం ఎక్కిన  తొలి వ్యక్తి  కూడా  ఆమెనే.   బాగా చదువుకుని మంచి  ఉద్యోగం సంపాదించి, అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రిని బాగా చూసుకోవాలని, పేదరికం నుండి విముక్తి చేయాలని ఎన్నో కలలు కంది. కానీ ఆ కలలన్నీ గాల్లోనే కలిసిపోయాయి.

ఉదయపూర్‌లో బిటెక్ పూర్తి చేసిన  ఆమె ఇంజనీరింగ్ , టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదవడానికి యునైటెడ్ కింగ్‌డమ్‌కు పయనమైంది.ఉదయం  తమ ప్రియమైన కుమార్తెకు హృదయపూర్వక వీడ్కోలు పలికి ఇంటికి వెళ్లింది, ఆమె లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకుంటుందని, ఆమె చదువులో రాణిస్తుందని  కొండంత నమ్మకం  వాళ్లకి. అహ్మదాబాద్ నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయిన విమానంతో పాటు, వీరి ఆశలు కూడా గల్లంతైపోయాయి.

"ఆమె కళాశాల పూర్తి చేసిన తర్వాత, మాతోనే ఉంది ...లండన్‌లో పై చదువులు చదువు కోవాలనుకుంది. ఇందుకోసం మేం రుణం తీసుకుసి పంపాం.." అంటూ ఆమె తండ్రి సురేష్ ఖాతిక్ దుఃఖంతో చెప్పారు.

పాయిల్‌ చాలా మంచి అమ్మాయి అని ఆమె స్నేహితులు తెలిపారు. బీటెక్‌ పూర్తైన తరువాత ట్యూషన్లు చెప్పి, కుటుంబానికి ఆర్థికంగా తోడుగా ఉండేదని బంధువు పాయిల్‌ మరణంపై విచారం  వ్యక్తం చేశారు.  నెల రోజుల క్రితం పాయల్ ఖాతిక్‌ను చివరిసారిగా కలిశానని, గత ఆరేళ్లుగా తన కుమారుడికి ట్యూషన్‌ చెబుతోందనీ, పాఠక్ దంపతులు తెలిపారు. 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)