Breaking News

త‌లసేమియా లేని భార‌త్‌ కోసం : అకాన్ ఆహ్వానం పేరుతో నిధుల సేక‌ర‌ణ‌

Published on Sat, 08/16/2025 - 16:31

హైద‌రాబాద్‌: త‌లసేమియా లేని భారత్ త‌మ ల‌క్ష్య‌ంతో  బ్లడ్ వారియర్స్ స్వ‌చ్ఛంద సంస్థ‌ విశిష్ట కార్యక్రమాన్ని నిర్వహించింది. “భారతదేశాన్ని త‌లసేమియా నుండి విముక్తి చేయడం తమ లక్ష్యమనీ రోగులకు సమయానికి రక్తం అందించడం, కొత్త కేసులు రాకుండా తక్కువ ఖర్చుతో స్క్రీనింగ్ చేయించడం ద్వారానే ఇది సాధ్యమని వ్యవస్థాపకుడు కృష్ణ వంశీ వెల్లడించింది. గతంలో పోలియో నిర్మూలన చేసినట్లు, మనం కలసికట్టుగా కృషి చేస్తే త‌లసేమియాను కూడా నిర్మూలించవచ్చని ఆయన తెలిపారు. 

79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రముఖ లౌంజ్ అండ్‌ పబ్ అకాన్ సౌజన్యంతో బ్లడ్ వారియర్స్‌కు నిధుల సేక‌ర‌ణ కోసం అకాన్ ఆహ్వానం కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది. రోజంతా సాగిన ఈ కార్యక్రమంలో నగరానికి చెందిన పౌరులు, సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు. త‌లసేమియా లేని భారత నిర్మాణానికి మద్దతుగా ఈ సందర్భంగా అందరూ ప్ర‌తిన బూనారు.

అకాన్ వ్యవస్థాపకుడు నిహాల్ రెడ్డి గుర్రాల మాట్లాడుతూ.. సమాజానికి తిరిగి ఇవ్వాలన్న తపనతో అకాన్ ఆహ్వానం కార్య‌క్ర‌మం ఏర్పాటు చేశామ‌న్నారు.  ఇలాంటి కార్యక్రమాలు సమాజాన్ని చైతన్యపరచి, కలసికట్టుగా చర్యలు తీసుకునేలా చేస్తాయ‌ని కృష్ణ వంశీ అభిప్రాయ‌ప‌డ్డారు. బ్లడ్ వారియర్స్ చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాల‌ను వివ‌రించారు. కొత్త‌గూడెం–భద్రాచలంను దేశంలోనే తొలి త‌లసేమియా రహిత జిల్లాగా మార్చాలని సంకల్పించిన‌ట్టు చెప్పారు.

Videos

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు