Breaking News

ఒక‘ట్రెండు’సార్లు ఆలోచించండి...

Published on Wed, 03/11/2026 - 00:55

‘ఏమవుతుంది లే’ అనే నిర్లక్ష్యం కంటే... ‘ఎందుకైనా మంచిది’ అనే ముందు చూపు చాలా మంచిది. ఇప్పుడు డిజిటల్‌ మీడియాలో ‘వైరల్‌  ఏ.ఐ. క్యారికేచర్‌’ ట్రెండ్‌ అనేది హాట్‌ టాపిక్‌. ‘ఇదిగో నా గురించి నీకు అన్నీ చెప్పేస్తున్నాను. క్యారికేచర్‌ అదిరిపోవాలి’ అని ఏ.ఐ.కి ప్రాంప్ట్‌ ఇవ్వడం అనేది ఈ ట్రెండ్‌లో భాగం. అయితే అయితే... ఈ ట్రెండ్‌లో భాగంగా వేలం వెర్రిగా వ్యక్తిగత సమాచారాన్ని షేర్‌ చేయడం వల్ల, మోసగాళ్లకు చేతినిండా పనే అని హెచ్చరిస్తున్నారు డిజిటల్‌ నిపుణులు...

యూజర్‌లు పర్సనల్‌ ఫొటోను షేర్‌ చేసి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్స్‌ను క్యారికేచర్‌ లేదా ఇలస్ట్రేషన్‌ క్రియేట్‌ చేయమని అడగడమే వైరల్‌ ఏఐ క్యారికేచర్‌ ట్రెండ్‌. మన అభిరుచులు, జీవిత విశేషాలు, ఉద్యోగ విశేషాల ఆధారంగా ఈ క్యారికేచర్‌ క్రియేట్‌ అవుతుంది. క్యారికేచర్‌ కదా అనుకోవద్దు! ‘ఏమవుతుంది? వస్తే గిస్తే నా క్యారికేచర్‌ బయటికి వస్తుంది. దీంతో మోసాలు ఎలా చేస్తారు?’ అనే వాళ్లు బోలెడు మంది. అయితే మనం అనుకున్నట్లు బయటికి వచ్చేది క్యారికేచర్‌ మాత్రమే కాదు...
‘ఎవ్రీథింగ్‌ యూ నో ఎబౌట్‌ మీ’ అనే ఒకే ఒక ప్రాంప్ట్‌తో ఏఐ ఎన్నో వివరాలను లాగేస్తుంది. చివరికి మన కమ్యూనికేషన్‌ స్టైల్‌ను కూడా విడిచి పెట్టదు. ఒక్కముక్కలో చె΄్పాలంటే... బయటికి వచ్చేది క్యారికేచర్‌ రూపంలోని మన పర్సనల్‌ ప్రోఫైల్‌! అది మనం ఇష్టపూర్వకంగా అందజేసిందే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

ట్రెండ్‌లో భాగంగా...
వైరల్‌ క్యారికేచర్‌ ట్రెండ్‌ క్రియేటివ్‌గా, ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినప్పటికీ, ఈ ట్రెండ్‌ ద్వారా బయటికి వచ్చే వ్యక్తిగత సమాచారం ఆధారంగా మోసాలు జరిగే అవకాశం ఉందని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘నా మనస్తత్వానికి అద్దం పట్టే క్యారికేచర్‌ క్రియేట్‌ చేసుకోవాలి’ అనే ఉత్సాహంతో యూజర్‌లు ఎటువంటి పరిమితులూ లేకుండా సమాచారాన్ని యాక్సెస్‌ చేసుకోవడానికి అనుమతి ఇస్తారు. సమాచారం ఎంత ఎక్కువ ఇస్తే క్యారికేచర్‌ అంత బాగా వస్తుందనేది వారి ఉద్దేశం. ట్రెండ్‌లో భాగంగా రెఫరెన్స్‌ ఫొటోతో పాటు అదనపు సమాచారం కూడా అందిస్తున్నారు. ఉదాహరణకు... కంపెనీ పేరు, కార్పొరేట్‌ లోగో, చేస్తున్న ఉద్యోగం, పని చేస్తున్న నగరం పేరు, దినచర్య, కుటుంబ వివరాలు... మొదలైనవి తెలియజేస్తున్నారు.

ఎమోషనల్‌ మానిప్యులేషన్‌
ఫొటోగ్రాఫ్‌కు సందర్భోచిత వివరాలు జత చేస్తే డిజిటల్‌ మోసాలు జరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తి ఫొటోతో స్కామర్‌లు వివిధ ΄్లాట్‌ఫ్లామ్‌లలో నకిలీ ప్రోఫెషనల్‌ ప్రోఫైళ్లను సృష్టించవచ్చు. జెనరేటివ్‌ వాయిస్‌ లేదా డీప్‌ఫేక్‌లను రూపొందించడానికి ఉపయోగించవచ్చు. ఫొటోను డిస్‌ప్లే ఇమేజ్‌గా ఉపయోగించి కంపెనీ లేదా ప్రోఫైల్‌ పేజీలను క్లోన్‌ చేయడానికి కూడా ఉపయోగించవచ్చు. ప్రామాణికంగా, నమ్మదగినదిగా చేయడానికి ఇలాంటి ట్రిక్స్‌ను ఉపయోగిస్తుంటారు. ఫొటోగ్రాఫ్‌తో పాటు ఉద్యోగం, ఆఫీసు వివరాలు మోసగాళ్ల చేజిక్కితే ఎంతమాత్రం అనుమానం రాకుండా బిజినెస్‌ ఈమెయిల్స్, మెసేజ్‌లను స్కామర్‌లు రూపొందించి ఆ వ్యక్తి కొలీగ్స్‌కు ఫేక్‌ ఇన్‌స్ట్రక్షన్స్, రిక్వెస్ట్‌లను పంపే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల వివరాలు తెలిస్తే స్కామర్‌లు ఎమోషనల్‌ మానిప్యులేషన్‌కూ పాల్పడే ప్రమాదం ఉంది.

యస్‌... ఇది నిజమే
మనం అందించే డేటా పాయింట్స్‌ సవివరమైన డిజిటల్‌ ప్రోఫైల్‌ను రూపొందించడానికి ఉపకరిస్తాయి. ఇమేజ్‌తో జత చేసిన వివరాలతో సైబర్‌ నేరగాళ్లు సోఫిస్టికేటెడ్‌ స్కామ్‌లు చేసే అవకాశం ఉంది ‘ఏఐ–జనరేటెడ్‌ పర్సనల్‌ ఇమేజ్‌లు స్కామర్‌లకు ఉపయోగపడతాయా?’ అనే ప్రశ్నకు వచ్చే జవాబు... ‘అవును’ సాధారణంగా సైబర్‌ నేరగాళ్లు ఓపెన్‌ సోర్స్‌ ఇంటెలిజెన్స్‌ గ్యాదరింగ్‌ (వోఎస్‌ఐఎన్‌టీ)పై తగిన సమయం వెచ్చిస్తారు. లింక్డిన్, ఇన్‌స్టాగ్రామ్, న్యూస్‌ ఆర్టికల్స్‌....మొదలైన వాటి ద్వారా వ్యక్తుల డిజిటల్‌ ఫుట్‌ప్రింట్‌ను సేకరిస్తారు. వైరల్‌ ఏఐ క్యారికేచర్‌ ట్రెండ్‌ ద్వారా వారి పని మరింత సులభం అవుతుంది. వ్యక్తిగత సమాచారాన్ని వివిధ మార్గాలు, ΄్లాట్‌ఫామ్‌ల ద్వారా సేకరించడానికి బదులు ఒకేచోటు నుంచి తీసుకోవడానికి స్కామర్‌లకు అవకాశం ఇస్తుంది.

‘యూజర్‌లు పంచుకునే ఏ ఒక్క సమాచారం విడిగా ప్రమాదం కాదు. అయితే ఈ ట్రెండ్‌తో వచ్చిన చిక్కు ఏమిటంటే, అలవాట్ల నుంచి ఆందోళన వరకు యూజర్‌ షేర్‌ చేసే సమాచారాన్ని మొత్తం ఒకే దగ్గర చేరుస్తుంది. స్కామర్‌లు ఏ సమాచారాన్ని అయితే తెలుసుకోవాలనునుకుంటున్నారో ఆ సమాచారాన్ని ఇస్తుంది.
ఏ చెడు జరిగినా ‘ఇది కలికాలం నాయనా’ అనే మాట బాగా వినిపిస్తుంది. ఇప్పుడు కాలం మారింది. ‘ఇది డిజిటల్‌ కాలం నాయనా’ అనుకోవాల్సి వస్తోంది. ఏ ట్రెండ్‌ నుంచి ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు కదా! అందుకే జాగ్రత్త అవసరం...అత్యవసరం.

ఇలా చేయాలి...
ఐడెంటిఫైయబుల్‌ డేటా ప్రాంప్ట్స్‌ ఇవ్వవద్దు. ఉదా: పూర్తి పేరు, చేస్తున్న ఉద్యోగం, కంపెనీ పేరు, ఇంటి అడ్రస్‌... మొదలైనవి.
మీ లొకేషన్‌ లేదా, సంస్థ గురించి తెలుసునేలా చేసే లోగోలు, ఐడీ కార్డ్, డాక్యుమెంట్లు, లైసెన్స్‌ ప్లేట్స్, స్క్రీన్‌లు, భవన ముఖద్వారాలు, స్ట్రీట్‌  సైన్‌లు, బిల్డింగ్‌ పేర్లు కనిపించే ఫొటోలను అప్‌లోడ్‌ చేయవద్దు.

ఎమోషనల్‌ స్కామ్స్‌ నివారించడానికి  పిల్లలకు సంబంధించి సమాచారాన్ని షేర్‌ చేయకూడదు. కుటుంబ వివరాలను వెల్లడించకూడదు.
‘ఎవ్రీథింగ్‌ యూ నో ఎబౌట్‌ మీ’లాంటి ప్రాంప్ట్‌లు ఇవ్వకూడదు. దీనికి బదులుగా ‘క్రియేట్‌ యూజింగ్‌ వోన్లీ ది డిటేల్స్‌ ఇన్‌ దిస్‌ మెసేజ్‌ అండ్‌ డోన్ట్‌ యూజ్‌ పాస్ట్‌ చాట్స్‌ ఆర్‌ హిస్టరీ’ అని ఇస్తే సరిపోతుంది.

ఇతరుల అనుమతి లేకుండా వారి ఫొటోను అప్‌లోడ్‌ చేయవద్దు.
ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించే ముందు ప్రైవసీ పాలసీ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కంటెంట్‌ను ఎంత కాలం స్టోర్‌ చేస్తారు? కంటెంట్‌ను మోడల్‌ ట్రైనింగ్, సర్వీస్‌ ఇంప్రూమెంట్స్‌ కోసం ఉపయోగిస్తారా?... మొదలైన విషయాలు తెలుసుకోవాలి.

‘టెంపరరీ చాట్‌’లాంటి ప్రైవసీ మోడ్స్‌ను ఉపయోగించడం మంచిది.
ఒకవేళ మీరు ట్రెండ్‌ను ఫాలో కావాలనుకుంటే తాజాగా తీసిన హై–రిజల్యూషన్‌ ఫొటో కాకుండా పాత లేదా ఎడిటెడ్‌ ఇమేజ్‌ను ఉపయోగించాలి.
వైరల్‌ ట్రెండ్‌తో సంబంధం ఉన్న హానికరమైన లింక్‌లు, ప్రమాదకరమైన డౌన్‌లోడ్‌లు, ఫిషింగ్‌ నివారించడానికి సెక్యూరిటీ టూల్స్‌ను ఉపయోగించాలి.

Videos

11 వ రోజుకు చేరిన యుద్ధం.. అమెరికా మిత్ర పక్షాలపై ఇరాన్ దాడులు

రాష్ట్రాన్ని ముంచేలా చంద్రబాబు ప్రభుత్వం మళ్లీ భారీ అప్పు

కొత్త సుప్రీం మొజ్జబా ఖమేనీపై రగులుతున్న ఇరాన్

Anantapur: రథం కింద పడి ఐదుగురికి తీవ్ర గాయాలు

అలిగిన చిన్నారికి ఆహ్వానం భోజనానికి ఇంటికి పిలిచిన విజయ్

గుంజీలు తీయమంటే.. ఈ బుడ్డాడు చేసిన పనికి నవ్వాగదు

పోసుకునేవాడు.. నోరు జారిన రాజేంద్ర ప్రసాద్.. తమిళ తంబీలు ఫైర్‌!

టీడీపీ కార్యకర్తల వీరంగం YSRCP కార్యకర్త, మహిళా సిబ్బందిపై దాడి

ఇరాన్ స్కూల్ పై దాడి... దాడి అమెరికా పనేనా?

తీవ్రస్థాయిలో గ్యాస్ కొరత మూతపడుతున్న హోటళ్లు

Photos

+5

'డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు' తెర వెనక ఇలా (ఫొటోలు)

+5

కూతురితో బిగ్‌బాస్ సోనియా హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

విజయ్-రష్మిక మెహందీ సెలబ్రేషన్ ఫొటోలు

+5

బాక్సర్‌లా మారిపోయిన టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెటర్ పృథ్వీషా నిశ్చితార్థం (ఫొటోలు)

+5

సినిమా ఈవెంట్‌లో మెరిసిన అనన్య నాగల్ల (ఫొటోలు)

+5

విశాఖపట్నంలో వైభవంగా పైడిమాంబ తొలేళ్ల సంబరం (ఫొటోలు)

+5

'లేచింది మహిళా లోకం' మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియంలో సందడి చేసిన పీవీ సింధు (ఫొటోలు)

+5

కాబోయే భార్యని పరిచయం చేసిన హీరో బెల్లంకొండ (ఫొటోలు)