కలుపును నిర్మూలించే రోబోలొస్తున్నాయ్‌!

Published on Tue, 06/20/2023 - 14:58

మన దేశంలో పంట పొలాల్లో కలుపు వల్ల రైతులకు ఏటా జరుగుతున్న ఆర్థిక నష్టం రూ. 1980 కోట్లని నాలుగేళ్ల క్రితం నాటి అంచనా. పురుగులు, తెగుళ్ల నష్టాలకన్నా కలుపు నష్టమే ఎక్కువని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి లెక్కతేల్చింది. ఆధునిక వ్యవసాయ పద్ధతుల్లో భాగంగా స్వతంత్రంగా పనిచేస్తూ కలుపు మొక్కల్ని మాత్రమే నిర్మూలించే రోబోలు (అటానమస్‌ రొబోటిక్‌ వీడ్‌ కంట్రోల్‌ సిస్టమ్స్‌) వస్తున్నాయి.

కృత్రిమ మేధ, జీపీఎస్, జిఐఎస్‌ వంటి  అత్యాధునిక సాంకేతికతలతో రూపొందిన ‘రోబో కూలీలు’ ఇవి. వీటిల్లో అనేక రకాలున్నాయి. కలుపు తీసే రోబో తనను తానే నడుపుకుంటూ పంట సాళ్లలో వెళ్తూ సాళ్ల మధ్యన, వరుసల్లో మొక్కలు/చెట్ల మధ్యన ఉండే నిర్దేశించిన కలుపు మొక్కల్ని మాత్రమే గుర్తించి నాశనం చేస్తాయి. నాశనం చేసే పద్ధతులు అనేకం ఉన్నాయి.

గాలి, మంట (ఫ్లేమ్‌), చలి గాలి, మైక్రోవేవ్స్, లేజర్‌ కిరణాలు, వాటర్‌ జెట్‌ను ప్రయోగించటం ద్వారా (పంట మొక్కలు, చెట్లకు హాని జరగకుండా) కేవలం కలుపు మొక్కల్ని నిర్మూలించటం ఈ రోబోల ప్రత్యేకత. వీటి ఖరీదెక్కువ. నిర్వహణకు నైపుణ్యం కలిగిన పనివారి అవసరం ఉంటుంది. కూలీల సమస్యను అధిగమించే క్రమంలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా డ్రోన్ల మాదిరిగా వీటిని మన దేశంలోనూ వినియోగించే అవకాశాలు ఉన్నాయి.     
– పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)