Breaking News

ఇజ్రాయెల్‌ మెషీన్‌తో చిటికెలో నవయవ్వనం, కట్‌ చేస్తే రూ. 35 కోట్లు

Published on Fri, 10/04/2024 - 12:04

ఆరుపదుల వయసుదాటినా నవయవ్వనంతో మెరిసిపోవాలి. ముఖం మీద చిన్నముడత కూడా ఉండకూడదు. దీనికోసం ఎంత ఖర్చుపెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు కొంతమంది. ఈ క్రేజ్‌నే క్యాష్‌ చేసుకొంటున్నారు మరికొంతమంది కేటుగాళ్లు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న రూ. 35 కోట్ల ఘరానా మోసం ఈ విషయాన్ని రుజువు చేస్తోంది.

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో  రాజీవ్ కుమార్ దూబే , అతని భార్య, రష్మీ దూబే జంట అమాయకులను నమ్మించి వలలో  వేసుకుంది.  "ఇజ్రాయెల్‌లో తయారైన టైమ్ మెషిన్" ద్వారా అందర్నీ  నవ యవ్వనంగా మారుస్తామంటూ కొంతమంది వృద్ధులను బుట్టలో వేసుకుంది. కలుషిత గాలి వల్ల వేగంగా వృద్ధాప్యానికి గురవుతున్నామని, ‘ఆక్సిజన్ థెరపీ’ ద్వారా నెలరోజుల్లో యవ్వనం వస్తుందని చెప్పి  నమ్మబలికారు.  అలా ఏకంగా 35 కోట్ల రూపాయలను దండుకుంది.

 ఇందుకోసం కాన్పూర్‌లోని కిద్వాయ్ నగర్ ప్రాంతంలో థెరపీ సెంటర్ - ‘రివైవల్ వరల్డ్ ’ ను ప్రారంభించారు. "ఆక్సిజన్ థెరపీ" తో ఏకంగా  60 ఏళ్ల వ్యక్తిని 25 ఏళ్ల యువకుడిగా మార్చేస్తామని చెప్పారు. ఒక్కో సెషన్‌కు ఆరు వేలు, మూడేళ్ల రివార్డ్ సిస్టమ్ కోసం  రూ. 90వేలు... ఇలా రకరకాల ప్యాకేజీలను ఆఫర్‌ చేశారు. 

అయితే మోసం ఎన్నాళ్లో దాగదు కదా. బాధితుల్లో ఒకరైన రేణు సింగ్ ఫిర్యాదుతో ఈ భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.  తాను  రూ. 10.75 లక్షలు మోసం చేశారని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వందలాది మందిని సుమారు  రూజ35 కోట్లు మోసం చేశారని కూడా ఆమె ఆరోపించారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు  నమోదు  దర్యాప్తు చేస్తున్నామని  సీనియర్ పోలీసు అధికారి అంజలి విశ్వకర్మ తెలిపారు.  ప్రస్తుతం  నిందితులు  విదేశాలకు పారిపోయినట్లు అనుమానిస్తున్నారు.

 

Videos

నామినేషన్లపై పెద్దిరెడ్డి సంచలన కామెంట్స్

దాండియా వేడుకల్లో విషాదం.. విద్యార్థిని మృతి, పలువురికి గాయాలు

ముళ్ల కంచెలతో దిగ్బంధం.. పోలీస్ Vs వైఎస్ఆర్ సీపీ

ఏపీలో రాష్ట్రపతి పాలన?

కోల్ కతాలో దుర్గా పూజ వేడుకల్లో తీవ్ర విషాదం.. 19 మంది దుర్మరణం

YS అవినాష్ రెడ్డిపై టీడీపీ గూండాల హత్యాయత్నం

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)