Breaking News

సుష్టిగా తిన్నాక ‘కునుకు’ మంచిదే, కానీ ఈ డేంజర్‌ కూడా ..!

Published on Thu, 02/29/2024 - 14:40

పగటిపూట అన్నం తిన్నవెంటనే కాసేపు కునుకు తీయడం చాలామందికి అలవాటు. అందులోనూ వేసవి వచ్చిందంటే కాసేపైనా నిద్రపోవాల్సిందే. అయితే ఇది మన ఆరోగ్యానికి అసలు మంచిదా? కాదా? ఎంతసేపు కునుకు తీస్తే మంచిది?

పగటిపూట నిద్రపోవడం కొంతవరకూ మంచిదే. పని నుంచి కొంచెం విశ్రాంతి తీసుకోవడంతో అలసట దూర మవుతుంది. ప్రశాంతంగా, కొత్త ఉత్సాహంగా వచ్చినట్టుగా అనిపిస్తుంది.అందుకనే దీన్ని పవర్‌ న్యాప్‌ అని అంటారు. మధ్యాహ్నం నిద్ర అనేది మితిమీరితే మాత్రం  హానికరమైన ప్రభావం తప్పదంటున్నారు నిపుణులు.

పగటి నిద్ర పనికి చేటు అన్నట్టు ఆరోగ్యానికి కూడా ముప్పే. మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం. ఇదిరాత్రిపూట నిద్రను ప్రభావితం చేస్తుంది. మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం 20 శాతం కంటే ఎక్కువ పెరుగుతుందని మెడికల్ జర్నల్ ఆఫ్ అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ  గతంలో చేసిన అధ్యయనం చెబుతోంది. 

అంతేకాదు మధ్యాహ్నం 90 నిమిషాల కంటే ఎక్కువసేపు నిద్రపోయే వారికి పక్షవాతం వచ్చే ప్రమాదం 25 శాతం ఉంటుందట. కొలెస్ట్రాల్ స్థాయిలలో ఆటంకాలు ఎక్కువ నిద్రను కోల్పోయే రూపంలో కూడా గుర్తించవచ్చని అధ్యయనంలో వెల్లడైంది.

వీరికి మినహాయింపు
ముఖ్యంగా  చిన్న పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు గరిష్ఠంగా 90 నిమిషాల పాటు నిద్రపోవచ్చట. మిగిలినవారు గరిష్ఠంగా 10 నిమిషాల నుంచి అరగంట లోపు మాత్రమే పడుకోవాలి.

పగటి నిద్ర నష్టాలు 
♦ ఊబకాయం 
♦ రాత్రి నిద్రకు భంగం, బాడీ బయలాజికల్‌ సైకిల్‌ దెబ్బతింటుంది
♦ రాత్రి నిత్ర లేకపోతే అధిక రక్తపోటు, డయాబెటిస్‌, గుండె జబ్బులు, ఆందోళన లాంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం.
♦ డిప్రెషన్‌

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)