Breaking News

Ladakh ఆనందాల పర్యటనపై అనుమానాల ముసురు

Published on Fri, 06/20/2025 - 12:16

నగరంలో చాలా మందికి వేసవి సీజన్‌ పూర్తవ్వగానే టూర్స్‌ గురించిన టాపిక్స్‌పై చర్చలు పూర్తవుతాయి. కొంతమందికి మాత్రం అప్పుడే మొదలవుతాయి. అలాంటి వారిలో లద్దాఖ్‌ ప్రియులు ముందుంటారు. అయితే పహల్గామ్‌ దాడి తదనంతర పరిణామాల వల్ల పర్యాటకుల సంఖ్యలో కొంత మార్పు కనిపిస్తోంది. బైకర్స్, కార్లలో టూర్‌ వెళ్లే వారు ఇప్పటికే తమ తమ ప్లాన్స్‌ పూర్తిచేసుకునే దిశగా కదులుతున్నారు. అయితే వివిధ రకాల మార్గాల ద్వారా వెళ్లే పర్యాటకుల తాకిడి మాత్రం బాగా తగ్గిందని సమాచారం. -సాక్షి, సిటీబ్యూరో 

సోషల్‌ మీడియా కేంద్రంగా.. 
లద్దాఖ్‌ను తరచూ సందర్శించే ఉత్తరాది వాసి రట్టన్‌ ధిల్లాన్, లద్దాఖ్‌ లోని ముఖ్యపట్టణమైన లేహ్‌ ఖాళీగా ఉన్నట్లు చూపించే వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నారు. ‘గత 10 సంవత్సరాలుగా లేహ్‌ను సందర్శిస్తున్నా..  ఇంత తక్కువ మంది పర్యాటకులు ఉన్న లెహ్‌ పట్టణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది లద్దాఖ్‌ అంటే నమ్మడం కష్టం’ అంటూ ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు లద్దాఖ్‌ ప్రస్తుత పరిస్థితికి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. ది తాత్కాలికమేనని తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

జూన్‌ నెలలోనే  ఎందుకు?
పహల్గామ్‌ ఉగ్రవాద దాడి తరువాత, జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక రంగం దెబ్బతింది. హోటళ్ళు, రిసార్టులు హౌస్‌బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఈ ప్రాంతంలోని పొరుగు ప్రాంతాల్లో, ముఖ్యంగా దాని ప్రక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో కూడా కనిపిస్తోంది. అయితే మరోవైపు యువత మాత్రం తగ్గేదే లేదంటూ రైడర్స్‌ గ్రూపుల ద్వారా టూర్‌కు ప్లాన్‌ చేస్తున్నారు.

సాధారణంగా లద్దాఖ్‌ ప్రాంతం చలికాలంలో మంచు తీవ్రంగా ఉంటుంది. మంచుతో కప్పబడిపోయే రహదారుల వల్ల ప్రయాణం కష్టతరమవడం, మైనస్‌ డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని ఎవరూ ఎంచుకోరు.. అదే మే నెల నుంచి అక్టోబరు వరకూ ఈ ప్రాంతంలో వాతావరణం పూర్తి పొడిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో అద్భుతమైన వైవిధ్యభరితమైన లద్దాఖ్‌ అందాలను సందర్శించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. మరోవైపు ఈ సీజన్‌లో దేశంలోని మిగిలిన ప్రాంతాలు వర్షాలతో పర్యటనలకు అంత అనుకూలంగా ఉండకపోవడం కూడా లద్దాఖ్‌ను ఈ సీజన్‌లో అత్యంత అనువైన ఎంపికగా మార్చింది అనొచ్చు.

అయితే నగరంనుంచి ఏటా ఈ సమయానికి లద్దాఖ్‌ ప్రయాణానికి 

హుషారుగా సిద్ధమయ్యే బైకర్లు ప్రస్తుతం కొంత తటపటాయిస్తున్నారని నగరానికి చెందిన బైకర్‌ సదాశివరెడ్డి అన్నారు. తీవ్రవాద దాడి అనంతరం సెక్యూరిటీ పటిష్టం కావడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులపై బైకర్స్‌ సందేహంతో ఉన్నారని, అయితే ఇప్పటికే కొందరు బయలుదేరారు కాబట్టి.. వారిని చూసి మరికొందరు కూడా అదే బాట పట్టవచ్చని చెప్పారాయన.  లద్దాఖ్‌ అనేది బైకర్స్‌కి స్వర్గధామం లాంటిది అంటున్న ఆయన.. ఏటా కేవలం 3, 4 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాన్ని వదులుకోరని అంటున్నారు.  

బైకర్లలో సందిగ్ధం..అయినా తగ్గేదేలే..: అయితే నగరం నుంచి ఏటా ఈ సమయానికి లద్దాఖ్‌ ప్రయాణానికి హుషారుగా సిద్ధమయ్యే బైకర్లు ప్రస్తుతం కొంత తటపటాయిస్తున్నారని నగరానికి చెందిన బైకర్‌ సదాశివరెడ్డి అన్నారు. తీవ్రవాద దాడి అనంతరం సెక్యూరిటీ పటిష్టం కావడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులపై బైకర్స్‌ సందేహంతో ఉన్నారని, అయితే ఇప్పటికే కొందరు బయలుదేరారు కాబట్టి.. వారిని చూసి మరికొందరు కూడా అదే బాట పట్టవచ్చని చెప్పారాయన.  లద్దాఖ్‌ అనేది బైకర్స్‌కి స్వర్గధామం లాంటిది అంటున్న ఆయన.. ఏటా కేవలం 3, 4 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాన్ని వదులుకోరని అంటున్నారు.  

ప్రభావం ఉన్నా.. పుంజుకుంటోంది..  
దేశంలో మరే ప్రాంతంలో చూడలేని అనేక అద్భుతమైన ప్రకృతి విశేషాలు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతం అక్కడి  ప్రకృతి సౌందర్యం అలవాటైతే మళ్లీ మళ్లీ వెళ్లకుండా ఉండడం కష్టం. అందుకే దేశవ్యాప్తంగా లద్దాఖ్‌ చాలా కాలం నుంచి అనేక మందికి అభిమాన టూరిస్ట్‌ ప్లేస్‌గా మారింది. బైక్‌ రైడర్లకైతే మరింత ఇష్టం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు కార్లు, ఇతర వాహనాల ద్వారా వెళ్లేవారు పెరిగారు. 

గత నెలతో పోలిస్తే మెరుగైందంటున్న టూర్‌ ఆపరేటర్లు:  గత ఐదారేళ్లుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకప్పుడు బైక్‌ రైడర్‌గా లద్దాఖ్‌కు వెళ్లడం అలవాటైన నేను ఆ తర్వాత టూర్‌ ఆపరేటర్‌గా మారాను.  గత పదేళ్లుగా పర్యాటకుల్ని తీసుకెళుతున్నా. తీవ్రవాద దాడి వల్ల సాధారణంగా మే నెల కల్లా ఊపందుకోవాల్సిన పర్యాటకుల సంఖ్య జూన్‌ నెలకు గానీ పుంజుకోలేదు. ఏదేమైనా ఈ నెలలో పరిస్థితి పూర్తి ఆశాజనకంగా కనిపిస్తోంది.   – శ్రవణ్‌ కొన్నేరు, మ్యాడ్‌ ఓవర్‌ లద్దాఖ్‌ 

చదవండి: ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే..

 

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)