Breaking News

సరికొత్త మ్యూజిక్‌ థెరపీ..'జెంబే'.. ఆ వ్యాధులను నయం చేస్తుందట..!

Published on Mon, 04/14/2025 - 09:21

ఉరుకుల పరుగుల జీవనంలో ఉల్లాసం కావాలి. వారంలో ఒక్కరోజైనా, ఒక్క పూటైనా ఒత్తిడి నుంచి విముక్తి కావాలి. అందుకే నగరవాసులు ఎల్లప్పుడూ ఆసక్తికరమైన ప్రత్యామ్నాయ చికిత్సల కోసం అన్వేషిస్తూ ఉంటారు. అలాంటి అన్వేషణ ఫలాల్లో ఇప్పుడు, ఆఫ్రికన్‌ డ్రమ్‌ అయిన జెంబే ఒకటిగా నిలిచింది. మ్యూజిక్‌ థెరపీలో భాగంగా దీనిని నగరవాసులు ఆస్వాదించడం పెరుగుతోంది. 

చక్కని సంగీతం వినడం మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుందని కొత్తగా చెప్పనక్కర్లేదు. అయితే సంగీత వాయిద్యాన్ని పలికించడం కూడా అంతకు మించిన ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిస్తుంది అని జెంబే (Djembe) నిరూపిస్తోంది. ఇప్పటికే ముంబై వంటి నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో, ముఖ్యంగా మాల్స్‌లో సర్వసాధారణంగా జెంబే సంగీత కార్యక్రమం ఇప్పుడిప్పుడే హైద‌రాబాద్‌ (Hyderabad) నగరంలోనూ ప్రాచుర్యం పెంచుకుంటోంది. 

డ్రమ్‌ మారో డ్రమ్‌.. 
సంగీత పరికరమైన డ్రమ్‌ – దాని అంతర్గత లయ స్వభావం కారణంగా – దానిని పలికించే వారికి ఆరోగ్య ప్రయోజనం చేకూరుస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిజానికి గిటార్‌ లేదా హార్మోనికాతో పోలిస్తే సరళమైన సంగీత వాయిద్యం డ్రమ్స్‌. దీనిని పలికించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సైకోథెరపిస్ట్‌ నీతా మాట్లాడుతూ, ‘డ్రమ్‌ శిక్షణ స్ట్రోక్‌ పేషెంట్లకు పార్కిన్సన్స్‌ వ్యాధి ఉన్నవారికి సైతం ఉపయుక్తం. 

నడక, చేయి నియంత్రణ ద్వారా వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. వారి కదలికల్లో ఖచ్చితత్వం, వేగం, సున్నితత్వాన్ని మెరుగుపరుస్తుంది’ అంటున్నారు. ‘ఇది మెదడులో డోపమైన్‌ (Dopamine) స్థాయిలను పెంచుతుంది. అయితే అధికంగా డ్రమ్మింగ్‌ మీద ఆధారపడితే మాత్రం ప్రయోజనకరంగా ఉండకపోవచ్చు’ అని కూడా నీతా చెబుతున్నారు. 

ఒంటరిగా డ్రమ్మింగ్‌ (Drumming) చేయడం ఏకాగ్రతను పెంచుతుంది, లోతైన శ్వాస ద్వారా మెరుగైన ఆక్సిజన్‌ ప్రవాహాన్ని ప్రోత్సహిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. సమన్వయ శక్తిని పెంచుతుంది. ప్రస్తుతంలో జీవించడం (మైండ్‌ ఫుల్‌ నెస్‌) సాధనలో సహాయపడుతుంది. స్నేహితులు లేదా ఇతరులతో కలిసి ప్లే చేయడం ఉత్తమ మార్గం. 

ఇందులో పాల్గొనేవారు అతని/ఆమె సౌలభ్యం, నైపుణ్యం ప్రకారం వాయిద్యాన్ని పలకిస్తారు కాబట్టి ఇది బంధాలను బలపరుస్తుంది, సహనాన్ని అలవరుస్తుంది. అపరిచితులను ఒకచోట చేర్చడం ద్వారా నలుగురిలో కలవడానికి ఇబ్బంది పడే వ్యక్తులకు ఆ ఫీలింగ్‌ పోయేలా చేస్తుంది. 

ఆఫ్రికాలో సందేశాలు పంపే సంగీతం.. 
జెంబే పశ్చిమ ఆఫ్రికాలో, ముఖ్యంగా మాలి, గినియా ఐవరీ కోస్ట్‌ ప్రాంత మూలాలను కలిగి ఉంది. వివాహాలు, దీక్షా ఆచారాల వంటి ఉత్సవ సందర్భాల్లో ఈ డ్రమ్‌ వాయించడం సంప్రదాయం. వీటి ధ్వని మైళ్ల దూరం వినబడుతుందట. అందుకని, సుదూర ప్రాంతాల్లో ముఖ్యమైన సందేశాలను చేరవేయడానికి కూడా ఉపయోగిస్తారట. 

కాలక్రమేణా, జెంబే ఆఫ్రికా ను దాటి ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకూ వ్యాపించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రాచుర్యం పొందిన వాయిద్యాల్లో జెంబే ఒకటి. గోబ్లెట్‌ ఆకారపు ఈ డ్రమ్‌ ఆఫ్రికాలోని డిజాలా/లెంకె చెట్టుకు చెందిన సింగిల్‌ పీస్‌ హార్డ్‌ వుడ్‌తో తయారవుతుంది. పైభాగం.. అంటే డ్రమ్‌హెడ్‌ గొర్రె/జంతు చర్మంతో రూపొందుతుంది. 

పెర్కుషన్‌ వాయిద్యం.. ఆరోగ్యమార్గం.. 
‘దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన జెంబే ఒక పెర్కుషన్‌ వాయిద్యం. జాజ్, తబలా మృదంగం పెర్కుషన్‌ రంగంలో బాగా తెలిసిన ఎంపికలు అయితే, జెంబే నన్ను ఆకర్షించింది. అప్పటికే దీనిలో రాణిస్తున్న ఓ దక్షిణాఫ్రికా స్నేహితుడి ప్రోద్బలంతో దీన్ని సాధన చేశాను. సంగీతంలో పీహెచ్‌డీ చేశాను. మన శరీరంలోని ఏడు చక్రాల ప్రాముఖ్యతను నేను గుర్తించాను. 

హైద‌రాబాద్‌ నగరంలో తొలిసారి జెంబే ద్వారా మ్యూజికల్‌ థెరపీని పరిచయం చేశాను. ఇది మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి, ఒత్తిడి నిర్వహణలోనూ ఉపకరిస్తుంది. లయ ఆనందం ద్వారా ప్రజలను కనెక్ట్‌ చేసే అద్భుతమైన వాయిద్యం జెంబే.  అన్ని వయసుల వారికీ సంగీతం తాలూకు మ్యాజిక్‌ను అందించడాన్ని లక్ష్యంగా పెట్టుకుని కొంతకాలంగా నగరంలోని పాఠశాలలు కళాశాలల్లో ప్రదర్శనలు, 
వర్క్‌షాపులు నిర్వహిస్తున్నాం. 
– సాయి కుమార్, ది జెంబే సర్కిల్‌ వ్యవస్థాపకుడు 

ఎవరికి నప్పదు.. అంటే.. 
పెద్దపెద్ద శబ్దాలకు వ్యతిరేకంగా స్పందించే స్వభావం కలిగినవారు.. అలాగే.. భుజం కీళ్లు, మోచేతులు లేదా మణికట్టుకు గాయాలు, లేదా ఇతర సమస్యలు ఉన్నవారికి ఈ జెంబే నప్పదు. అలాగే కార్డియో యాక్టివిటీని తక్కువగా మాత్రమే చేయాలని వైద్య సలహా పొందిన వారు కూడా దీని జోలికి వెళ్లకపోవడమే మంచిది.  

చదవండి: అక్కడ న్యూ ఇయర్‌కి శుభాకాంక్షలు చెప్పుకోరు..! ఏం చేస్తారో తెలిస్తే షాకవ్వుతారు

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)