Breaking News

ఆ మూగజీవి ప్రతిస్పందనకు..ఎవ్వరైన ఇట్టే కరిగిపోవాల్సిందే..!

Published on Fri, 07/18/2025 - 16:16

ఆ మూగజీవి స్కూల్‌కి ఎందుకొచ్చిందో గానీ..అక్కడున్న పిల్లల వద్ద అది కూడా ఓ పసిపాపాయిలా కూర్చొని ఉండటం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. అక్కడ అదిచేసే పని చూస్తే..కళ్లార్పడమే మరిచి ఆ శునకాన్నే చూస్తుండిపోతారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. 

ఆ వీడియోలో ఒక అందమైన కుక్క పాఠశాల తరగతి గదిలో పిల్లల తోపాటుగా కూర్చొని ఉంటుంది. చాలా అమాయకంగా అందర్ని చూస్తూ ఉంటుంది. ఆ క్లాస్‌లో పిల్లలంతా డ్రాయింగ్‌ వేయడంలో మునిగిపోతే..ఈ కుక్క కూడా వేయాలనుకుందో ఏమో గానీ ఒక కాలుపైకిత్తి తనకు సమీపంలో ఉన్న పిల్లవాడి చేతిని తాకుతుంది. నేనే రంగులు వేస్తా అన్నట్లుగా అతడి చేతిలో తన కాలుని పైకెత్తి పెడుతుంది. ఆ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది. 

అయితే ఆ పిల్లవాడు చేతిని వదిలించుకని తన పనిలో తాను నిమగ్నమవుతుండగా మరోసారి అడుగుతున్నట్లుగా కాలుతో కదుపుతుంది. అయితే ఆ చిన్నారి కూడా నీ వల్ల కాదులే అన్నట్లుగా తన పని తాను చేసుకుంటున్న ఆ నిశిబ్ధ సంభాషణకు ఎలాంటి వారి మనసైనా ఇట్టే కరిగిపోతుంది. పాపం అది మాత్రం ఎవ్వరైనా నాకు కొంచెం డ్రాయింగ్‌ వేసే పేపర్‌ ఇవ్వరూ..అన్నట్లుగా చూస్తున్న దాని చూపు భలే నవ్వుతెప్పిస్తోంది .

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోకి మూడు మిలయన్లకు పైగా వ్యైస్‌ నాలుగు లక్షలకు పైగా లైక్‌లు వచ్చాయి. అంతేగాదు నెటిజన్లు యూనిఫాం ఏది.. ? వేసుకుని వచ్చి ఉంటే నీకు డ్రాయింగ్‌ వేసే పేపర్‌ ఇచ్చేవారు అంటూ ఆ క్యూట్‌ కుక్కని ఉద్దేశిస్తూ.. కామెంట్లు చేస్తూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: ఎంఆర్‌ఐ స్కానింగ్‌ భయానక అనుభవం..! ఇలా మాత్రం చెయ్యొద్దు..)
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)