Breaking News

ఈ బ్రాంచ్‌లో ఉద్యోగులందరూ మహిళలే!

Published on Fri, 07/04/2025 - 16:02

హైదరాబాద్: ఆదిత్య బిర్లా క్యాపిటల్‌కు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ విభాగమైన ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (ABSLI), హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో పూర్తిగా మహిళలతో నిర్వహించబడే తమ తొలి బ్రాంచ్‌ను ప్రారంభించింది. వృత్తిగతంగా అర్థవంతమైన అవకాశాలు అందించడం, హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలు విస్తరించే క్రమంలో మహిళలకు సాధికారత, సమానావకాశాలు కల్పించే దిశగా ఈ శాఖను ప్రారంభించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.  వైవిధ్యం, సమానత్వం, సమ్మిళితత్వ (DEI) లక్ష్యాల సాధనలో ఇది కీలక మైలురాయిలాంటిదని పేర్కొంది. ఇప్పటికే    కంపెనీ ఈ ఏడాది తొలినాళ్లలో ముంబైలోని ములుండ్‌లో పూర్తిగా మహిళా సిబ్బందితో శాఖను ప్రారంభించగా, ఇది రెండోదికావడం విశేషం. 

హిమాయత్‌నగర్ శాఖను పూర్తిగా మహిళలు నిర్వహిస్తారు. ఫ్రంట్‌లైన్ సేల్స్ ఉద్యోగిగా ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగిన స్థానిక మహిళ దీనికి సారథ్యం వహిస్తున్నారు. ఈ శాఖలో పిల్లల కోసం ప్రత్యేకంగా కిడ్స్ రూమ్ కూడా ఉందనీ, శిక్షణ కార్యక్రమాలు, క్లయింట్ సమావేశాలపై దృష్టి పెట్టేందుకు ఇది సహాయపడుతుందని కంపెనీ తెలిపింది.

“మహిళల సాధికారత ఒక బాధ్యత మాత్రమే కాదు, మా వ్యూహాత్మక ప్రాధాన్యతాంశం కూడా అని ABSLI విశ్వసిస్తుంది. సమతౌల్యతను సాధించేందుకు తోడ్పడుతూ, ఆకాంక్షలను గౌరవించే విధంగా వర్క్‌ప్లేస్‌లను తీర్చిదిద్దడం ద్వారా సమ్మిళిత వృద్ధికి దోహదపడటంలో, మాకున్న నిబద్ధతకు ఈ ఆల్-ఉమెన్ శాఖ ఒక నిదర్శనం. నాయకత్వం వహించేందుకు, వృద్ధిలోకి వచ్చేందుకు, స్ఫూర్తిగా నిల్చేందుకు మహిళలకు దీర్ఘకాలిక అవకాశాలు కల్పించడమే మా లక్ష్యం” అని ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ & సీఈవో Mr. కమ్లేశ్ రావు తెలిపారు.

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)