Breaking News

ఇది ప్రభాస్ గిఫ్ట్

Published on Sun, 01/11/2026 - 05:16

బలమైన క్రమశిక్షణతో పెరిగిన మనసు, కళను ప్రేమించే హృదయం ఈ రెండింటి మధ్య సమతుల్యతే ఆమె వ్యక్తిత్వం. భాషలు మారినా, పాత్రలు మారినా తన అసలైన స్వరాన్ని మాత్రం కోల్పోని నటి రిద్ధి కుమార్‌. ఆ విషయాలన్నీ ఆమె మాటల్లోనే..

⇒ ఆర్మీ బ్యాక్‌గ్రౌండ్‌లో పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే క్రమశిక్షణ, ఫోకస్, దేనికైనా ఈజీగా అడాప్ట్‌ అవడం అన్నీ సహజంగానే అలవాటయ్యాయి.
⇒ భాషలు నేర్చుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, తమిళం, ఫ్రెంచ్‌ సహా ఏడు భాషలు మాట్లాడగలను. కొత్త భాష అంటే నాకు కొత్త ప్రపంచం.
⇒ మిస్‌ యూనివర్స్‌ ఇండియా వైల్డ్‌కార్డ్‌గా తిరిగి రావడం నాకే ఒక సర్‌ప్రైజ్‌. నటనతో పాటు నేనెవరో మళ్లీ గుర్తు చేసిన అనుభవం అది. అదే నన్ను సినిమాల్లోకి కూడా తీసుకొచ్చింది. 

⇒ తొలిసారి ‘లవర్‌’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. తర్వాత ‘అనగనగా ఓ అతిథి’, ‘రాధే శ్యామ్‌’ చేశాను. ఇలా ప్రతి సినిమా నాకు ఒక పాఠమే. 
⇒ కెమెరా ముందు నటించడమే కాదు, కెమెరా వెనుక ప్రపంచాన్ని చూడడం కూడా నాకు చాలా ఇష్టం. ఫొటోగ్రఫీ చేస్తూ ‘ఈ క్షణం మళ్లీ రాదు’ అని అనిపిస్తుంది. 
⇒  ట్రావెల్‌ అంటే టూరిస్టు స్పాట్స్‌ కంటే ‘హిడెన్  జెమ్స్‌’ నాకు ఎక్కువ ఇష్టం. ఇటీవల అహ్మదాబాద్‌ ఓల్డ్‌ సిటీ వైబ్స్‌ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. 

⇒  పుస్తకాలు నా బలహీనత. చదివే సమయం లేకపోయినా, కొనకుండా ఉండలేను. ఫిలాసఫీ అంటే నాకు చాలా ఆసక్తి.
⇒  ఎంత బిజీగా ఉన్నా చదువు మాత్రం వదల్లేదు. 2025లో కూడా మాస్టర్స్‌ ఇన్  ఫిలాసఫీ చేస్తున్నాను.

⇒ స్కిన్ కేర్‌ విషయంలో కొన్ని తప్పులు చేశాను. మేకప్‌తోనే నిద్రపోవడం, వేడి నీళ్లతో ముఖం కడగడం ఇవన్నీ ఇప్పుడిప్పుడే మానేసి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నాను.

⇒  ఫ్యాషన్  విషయంలో నా స్టయిల్‌ మారుతూనే ఉంటుంది. ప్రస్తుతం దేసీ స్టయిల్‌ ఇష్టం. ముఖ్యంగా చీరలో ఉన్న అందం వేరే లెవల్‌. ఇప్పుడు నేను కట్టుకున్న చీర ప్రభాస్‌ గిఫ్ట్‌గా ఇచ్చిందే. ఇది వేసుకున్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. 
⇒  నేనొక పెద్ద ఫూడీ. పుణేలోని ఒక టిబెటన్  స్ట్రీట్‌ ఫుడ్‌ స్పాట్‌ నాకు చాలా ఇష్టం. మోమోస్, థుక్‌పా అంటే ప్రాణం. అలాగే నెయ్యి దోశ, నెయ్యి కారంపొడి ఇడ్లీ, ఫిల్టర్‌ కాఫీ ఉంటే చాలు.

⇒  ప్రతి ఒక్కరికీ కొన్ని ఆధ్యాత్మిక ట్రిప్స్‌ చాలా అవసరం. అలా శంకరాచార్య ఆలయంతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
⇒  2025 నాకు చాలా స్పెషల్‌. ‘ది రాజా సాబ్‌’ సినిమాలో ప్రభాస్‌తో కలిసి నటించడం నా కెరీర్‌లో పెద్ద అడుగు. అలాగే ఈ న్యూ ఇయర్‌కు మరాఠీ సినిమాతో కొత్త ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతున్నాను. 
 

Videos

పెద్దపల్లి జిల్లాలో హైటెన్షన్.. కొట్టుకున్న కాంగ్రెస్ నేతలు

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)