Breaking News

నా చిరకాల స్వప్నం, గుడ్‌ న్యూస్‌ : రేణూ దేశాయ్‌ పోస్ట్‌ వైరల్‌

Published on Sat, 10/26/2024 - 16:20

నటి రేణుకా దేశాయ్‌ శుభవార్తను ఫ్యాన్స్‌తో  పంచుకుంది. చిన్న నాటి  కల నెలవేరింది అంటూ ఇంటూ ఇన్‌స్టాలో ఒకపోస్ట్‌ పెట్టింది.  ప్రస్తుతం ఇది నెట్టింట సందడి చేస్తోంది. 

సోషల్ మీడియాలో  చురుగ్గా ఉంటూ,  వ్యక్తిగత విషయాలతో పాటు , ఆసక్తికరమైన విషయాలను  పంచుకోవడం, పలు సామాజిక అంశాలపై స్పందించడం అలవాటు. అలాగే  అభిమానుల సాయంతో  తోచిన సహాయం చేస్తూ ఉంటుంది. పర్యావరణం, మూగ జంతువుల సంరక్షణకు సంబంధించి ఏదో ఒక పోస్ట్ పెడుతూ అవగాహన కల్పిస్తూ ఉంటుంది.  తాజాగాలో ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఒక వీడియోలో చెప్పుకొచ్చింది. క్తికరమైన విషయాన్ని తన ఫ్యాన్స్‌తో  షేర్‌ చేసింది.  తనకు చిన్నప్పటినుంచి జంతువులు ముఖ్యంగా కుక్కలు, పిల్లులు మీద ఇష్టం ఎక్కువ అనీ, పెద్దాయ్యక వాటి కోసంఏదైనా చేయాలని కోరిక ఉండేదని, కోవిడ్‌ సమయంలో దీని ప్రాధాన్యతను తాను మరింత గుర్తించానని తెలిపింది.  ఎట్టకేలకు ఇన్నాళ్లకు ఒక ఎన్‌జీవోను రిజిస్టర్‌ చేసినట్టు వెల్లడించింది.  గతంలో ప్రమాదాలకు గురైన కుక్కలు లాంటివాటిని రక్షించడంలో  తనకు చాలామంది గొప్పవాళ్లు సాయం చేశారని తెలిపింది. ఇపుడిక తానే స్వయంగా ఒక సంస్థను, ఆంబులెన్స్‌ సేవలను అందుబాటులోకి  తీసుకొచ్చినట్టు చెప్పింది. అలాగే ఈ ప్రయాణంలో మరింత ముందుకు పోవాలంటే దాతల సాయం  కూడా చాలా అవసరం అంటూ,  సాయం  చేసి, మూగజీవాల రక్షణలో తనకు తోడుగా నిలవాలని విజ్ఞప్తి చేసింది.

‘‘ఈ రోజు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు, చిన్ననాటి కల నెరవేరింది,  అందుకే క్షణాన్ని మీ అందరితో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ తన సంస్థకు సంబంధించిన వివరాలను, తన ఆశయాలను ఈ వీడియోలో చెప్పుకొచ్చింది. దీనిపై నెటిజన్లు ఆమెను ఆభినందిస్తున్నారు. జంతువుల సంరక్షణ, వైద్య సాయం అందించే క్రమంలో విజయం సాధించాలి అంటూ విషెస్‌  అందించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)