ఆ ఆనందమే వేరు!

Published on Sun, 02/01/2026 - 00:23

మనసును తాకే అభినయంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నటి మమితా బైజు. ఆమె మనసులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు దాగున్నాయి. అవన్నీ ఇప్పుడు ఆమె మాటల్లోనే, మీ కోసం...

⇒ అసలు పేరు నమిత. ‘మమిత’ అనే పేరు సినిమాలు ఇచ్చిన బహుమతి. ఇంట్లో మాత్రం ఇప్పటికీ పొన్నుమణి, మమ్మే అని పిలుస్తారు. ‘సూపర్‌ శరణ్య’ తర్వాత ‘సోనా’ కూడా అయ్యాను.

⇒ నటనకంటే ముందే నాట్యం  నా జీవితంలో ఉంది. చిన్నప్పటి నుంచి భరతనాట్యంలో శిక్షణ తీసుకున్నాను. స్టేజ్‌పై అడుగులు వేస్తే వచ్చే ఆనందం వేరే ఏదీ ఇవ్వలేదు.

⇒  సినిమాల మధ్యలోనూ సైకాలజీ చదవాలని ప్రయత్నించాను. షూటింగ్స్‌ వలన క్లాసులు మిస్‌ అయ్యాయి. కాని, నేర్చుకోవాలనే కోరిక ఇంకా అలాగే ఉంది.

⇒  మేకప్‌ లేకుండా, సింపుల్‌ దుస్తుల్లోనే ఎక్కువ హ్యాపీగా ఉంటాను. డిజైనర్‌ డ్రెస్సులు కాదు, నా అల్మరాలో ఉన్న వాటితోనే ఎక్కువగా స్టయిలింగ్‌ చేసుకుంటాను.

⇒ నేనొక ఫూడీ. అందులోనూ నాన్‌వెజ్‌కి  నో చెప్పలేను. పంచకర దోశ, బాషి బిర్యానీ  నా ఫేవరెట్స్‌. మలయాళీ వంటకాలంటే ఇల్లు గుర్తు వస్తుంది. కాని, తమిళ సెట్‌ దోశ, నెయ్యి ఇడ్లీలకు కూడా పెద్ద ఫ్యాన్‌ను. వంకాయ మాత్రం నాకు చాలా బోరింగ్‌ కూర.

⇒  మలయాళం నా మాతృభాష. కాని, ఇతర భాషా చిత్రాల్లో నటించాలంటే భాషను గౌరవించాలి అనిపించింది. ఒక్కో పదం నేర్చుకుని ఇప్పుడు తమిళం, తెలుగు చదవడం, రాయడం కూడా వస్తోంది.

⇒  స్క్రీన్‌పై కెమిస్ట్రీ చూసి వచ్చే డేటింగ్‌ రూమర్స్‌ నాకు కొత్త కాదు. అవన్నీ సోషల్‌ మీడియా కథలే! నా రియల్‌ రిలేషన్ షిప్‌ నాకు మాత్రమే తెలుసు.

⇒ సెట్‌లో ఉన్నప్పుడు చాలా కామ్‌గా ఉంటాను. కెమెరా ఆన్‌ అయితే పూర్తిగా మారిపోతాను. ఆ మాయే నన్ను నటన వైపు తీసుకొచ్చింది. పెద్ద కమర్షియల్‌ హిట్స్‌ కంటే, మనసును తాకే పాత్రలే నాకు నిజమైన విజయం.

⇒ రాబోయే ఒక సినిమా నన్ను కొత్తగా పరిచయం చేస్తుంది. ఆ పాత్ర తర్వాత ‘మమిత’ను మరో కోణంలో చూడబోతున్నారు.

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)