Breaking News

వెయ్యి ఇంజెక్షన్లు, రెండు గర్భస్రావాలు..! ఐవీఎఫ్‌ జర్నీపై నటి షాకింగ్‌ వ్యాఖ్యలు

Published on Wed, 07/22/2026 - 17:09

సూపర్ మోడల్, బాలీవుడ్ నటి తేజస్విని కొల్హాపూరే టెలివిజన్‌ సిరీస్‌తో కెరీర్‌ మొదలు పెట్టి..'తేరా జాదూ చల్ గయా మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. విలక్షణమైన నటనతో మెప్పించి విమర్శకులు ప్రశంసలందుకున్న దిగ్గజ నటి. ఆమె స్వయాన పద్మినీ కొల్హాపూరేకు సోదరి, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌కు మేనత్త. ఆమె చిత్ర నిర్మాత, నటుడు పంకజ్ సరస్వత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ దంపతులకు ఒక కుమార్తె. 

ఆమె సిద్ధార్థ కన్నన్‌ పాడ్‌కాస్ట్‌ తన ఐవీఎఫ్‌ జర్నీ గురించి చాలా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆ ప్రక్రియ ఎంత కష్టమైందో ఆవేదనగా చెప్పుకొచ్చారు. అంతేగాదు యువతకు సంతాన విషయంలో చక్కటి సందేశం కూడా ఇచ్చారామె. తన జీవితంలో చాలా కష్టమైన దశ అంటూ ఉంటే అది ఐవీఎఫ్‌ జర్నీనే కన్నటీపర్యంతమైంది. అది మానసికంగా, శారీరకంగా ఎంతటి ఒత్తిడికి గురిచేస్తుందో పంచుకుంది. 

తాను ఐదుసార్లు ఐవీఎఫ్‌ చేయించుకున్నానని, నిస్సంకోచంగా వెల్లడించింది. ఎందుకు ఇంత ధైర్యంగా చెబుతున్నాననంటే ఆ ప్రక్రియలో ఉండే కష్టాలపై అదరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతోనే అంటూ తను ఎదుర్కొన్న బాధను వివరించారామె. నటిగా ఉన్నప్పడు ఇప్పటికీ తన ఆకృతిలో ఎంతో ‍వ్యత్యాసం ఉందని అన్నారు. మానసికంగా ఇప్పుడు బలంగా ఉన్నానను, కానీ ఆ సమయంలో శారీరకంగా మానసికంగా ఇంజెక్షన్ల వల్ల తన శరీరాకృతి ఘోరంగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. సుమారు వెయ్యికి పైగా ఇంజెక్షన్లు తీసుకున్నానని అన్నారు. 

గర్భం ధరించేంత వరకు వాటిని ఇస్తూనే ఉంటారని చెప్పారు. అలా ఐదు సార్లు ఆ ప్రక్రియ చేయించుకున్నా..సక్సెస్‌కాలేదని..చివరికి తన ప్రయత్నం ఫలించి నిలిచినా..రెండు సార్లు గర్భస్రావం అనంతరం..ప్రెగ్నెంట్‌​ అయినట్లు వివరించింది. ఆ మధ్యలో పడే బాధ అలాంటి ఇలాంటిది కాదని, మానసికంగా కుంగిపోతామంటూ వేదనగా చెప్పుకొచ్చింది. కాగా తేజస్విని కొల్హాపూరే, పంకజ్‌ సరస్వత్‌లు జనవరి 30, 2015న వేదిక అనే కుమార్తె జన్మనిచ్చారు. వివాహం అయిన ఎనిమిదేళ్లకు ఆ దంపతులకు సంతానం కలిగింది.

(చదవండి: ఒకేసారి ఎంబీబీఎస్‌, ఇంజనీరింగ్‌..! కట్‌చేస్తే..)

 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)