Breaking News

మాలాంటి క్షోభ మరెవ్వరికీ వద్దు..వారికి సాయం చేయాలి : బాబూ మోహన్‌

Published on Wed, 04/16/2025 - 11:31

చౌటుప్పల్‌: యువత వాహనాలు నడిపేటప్పుడు తమ కుటుంబాన్ని గుర్తుచేసుకోవాలని సినీ నటుడు, మాజీ మంత్రి బాబూమోహన్‌ సూచించారు. చౌటుప్పల్‌ పట్టణ కేంద్రంలోని అమ్మానాన్న అనాథాశ్రమాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఆశ్రమంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఆశ్రయం పొందుతున్న వారికి భోజనం వడ్డించారు. మతిస్థిమితం కోల్పోయిన వ్యక్తికి జుట్టు కత్తిరించారు. అనాథలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాహనాలు నడిపేటప్పుడు ఒక్క క్షణం ఆలోచన చేయకపోవడం మూలంగా చోటుచేసుకునే ఘటనలతో జీవింతాం క్షోభ అనుభవించాల్సి వస్తుందన్నారు. 

ఇదీ చదవండి: నాన్న అంటే అంతేరా...! వైరల్‌ వీడియో

తాము సరైన పద్ధతిలో వెళ్తే సరిపోదని, ఎదుటి వ్యక్తులు సైతం సరైన పద్ధతిలో వస్తేనే ప్రమాదాలు జరగవన్నారు. గతంలో తన కుమారుడు ఓ పాపను తప్పించే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. అనాథలకు సేవ చేసే భాగ్యం ఊరికనే రాదని, భగవంతుడు సంకల్పిస్తేనే అది సాధ్యమవుతుందన్నారు. ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులు అనాథలకు సేవలందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అమ్మనాన్న అనాథాశ్రమాన్ని సందర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. పేదలు, అనాథలు, అభాగ్యులకు సేవ చేస్తే ఎంతగానో సంతృప్తినిస్తుందన్నారు. 

తాను కూడా తన కుమారుడైన పవన్‌ బాబూమోహన్‌ పేరిట ట్రస్ట్‌ ఏర్పాటు చేసి పేదలకు సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ, ఆశ్రమ నిర్వాహకుడు గట్టు శంకర్, పవన్‌ బాబూమోహన్‌ ట్రస్ట్‌ ప్రతినిధి రాజ్‌కుమార్, ఆశ్రమ ప్రతినిధులు గట్టు శ్రావణి, గట్టు శ్రావణ్‌ పాల్గొన్నారు.

చదవండి: ఎయిర్‌ హోస్టెస్‌పై లైంగిక దాడి, వెంటిలేటర్‌పై ఉండగానే అమానుషం!
 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు