అమ్మ కావాలి...

Published on Sat, 02/21/2026 - 05:54

అమ్మ కావాలి... ఎప్పుడూ కావాలి... ఎల్లప్పుడూ కావాలి... పగలు ఆకలేసినా... నిద్ర నిద్ర కమ్ముకున్నా అమ్మ కావాలి. అమ్మ ఎత్తుకొని తిప్పాలి. తల నిమరాలి. బువ్వ పెట్టాలి. ముద్దు చేయాలి. దిష్టి తియాలి. మురిసిపోవాలి. ‘నా బంగారు కన్నా’... ‘చిన్ని నాన్నా’ అని గారాలు చేయాలి. అమ్మ ఆయువు పోయాలి. ఊపిరులూదాలి. పెంచాలి. గుండెకు హత్తుకుని నేనున్నా అని భరోసా ఇవ్వాలి.

మరి అమ్మ లేకపోతే. కనపడకుండా పోతే. ఎక్కడికి వెళ్లిందో తెలియకపోతే.

పసిబిడ్డకే కాదు... నోరు లేని జీవికి కూడా ఆ బాధ చాలా పెద్ద బాధ.

ఇక్కడ చూడండి. ఈ కోతి పిల్ల పేరు పుంచ్‌. ఈ పిల్ల తల్లి ఇది పుట్టిన వెంటనే వదిలేసి పోయింది. ఆ తల్లి బంధాన్ని తెంపుకుని పోయింది గానీ పిల్లకు తల్లి మరపుకు రాదే. పదే పదే తల్లి కావాలనిపిస్తుంది. తల్లిని తలుచుకుని ఉలికులికి పడి నిద్ర లేస్తూనే ఉంటుందే.

పుంచ్‌కు ఇప్పుడు ఏడు నెలల వయసు. జపాన్‌లోని ఇచికావా సిటీ జూలో ఉంటోంది. అమ్మ కోసం అది పడే బాధను చూసి జూ అధికారులు దానికో ఉరాంగుటాన్‌ బొమ్మను ఇచ్చారు.

దానికి ఆ బొమ్మే అమ్మ. దాని కన్నీరు ఆ బొమ్మకు తెలియదు. అమ్మకే తెలియనప్పుడు... బొమ్మకేం తెలుస్తుంది?
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)