Breaking News

అప్పుడు చెత్త కుప్పలో దొరికింది...ఇపుడు ఘనత కెక్కింది!

Published on Sat, 05/18/2024 - 14:44

పుట్టుకలోనే ఆ విధి చిన్న చూపు చూసింది  పుట్టాక తల్లిదండ్రులు మరింత అన్యాయం చేశారు.  మా కొద్దీ పాప అంటూ చెత్త కుప్పలో పడేశారు. కానీ ఇక్కడే ఆమెకు మరో దారి దొరికింది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుని తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆ సాహసం పేరు మాలా పాపాల్కర్‌. ఇంతకీ ఆమె సాధించిన ఘనత ఏంటి తెలుసుకోవాలంటే ఈ  కథనం చదవాల్సిందే.

25 ఏళ్ల క్రితం పుట్టుకతోనే కంటి చూపు లేదని కన్నవారే చెత్తకుప్పలో పడేశారు. మహారాష్ట్రంలోని జల్గావ్ రైల్వే స్టేషన్‌లో చెత్త కుప్పలో చిన్నారిని గమనించిన పోలీసులు స్థానిక రిమాండ్ హోంకు తరలించారు. అక్కడి నుంచి 270 కిలోమీటర్ల దూరం ఉన్న  చెవిటి, అంధుల కోసం మెరుగైన సౌకర్యాలతో  ఉండే సామాజిక కార్యకర్త శంకర్‌బాబా పాపల్కర్  అనాథాశ్రమంలో చేర్చారు. శంకర్‌బాబా బాలిక సంరక్షణకు ఏర్పాట్లు చేశారు. ఆశ్రమంలోనే అమ్మాయి బ్రెయిలీ లిపిలో చదువుకునే అవకాశం కలిగింది. తోటివారు గర్వపడేలా సత్తా చాటుకుంది.

పద్మశ్రీ అవార్డ్ గ్రహిత శంకర్ బాబా పాపల్కర్ ఆ చిన్నారికి తన ఇంటి పేరు కలిపి మాలా శంకర్ బాబా పాపల్కర్‌ అని పేరు పెట్టడం మరో విశేషం. అంతే మాలా పట్టుదలగా ఎదిగింది. తాజాగా (మే 16న ) విడుదలైన మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) ఫలితాల్లో మాలా ర్యాంక్ సాధించింది. ముంబై సెక్రటేరియట్ లో క్లర్క్ కం టైపిస్ట్ ఉద్యోగాన్ని దక్కించుకుంది. 

‘‘నన్ను రక్షించి, ఈ రోజు ఈ పరిస్థితికి తీసుకురావడానికే దేవుడు  దేవదూతలను పంపించాడని, ఇక్కడితో తాను ఆగనని యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతానని IAS అవడమే తన లక్ష్యం’ అని మాలా చెప్తుతోంది.  తన విజయానికి శంకర్ బాబా పాపల్కర్, యూనిక్ అకాడమీ అమరావతి ప్రొఫెసర్ అమోల్ పాటిల్, ప్రకాష్ టోప్లే కారణమంటూ వారికి  కృతజ్ఞతలు తెలిపింది. 

2018లో అమరావతి యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ , ప్రభుత్వ విదర్భ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ హ్యుమానిటీస్ నుండి ఆర్ట్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది మాలా. బ్రెయిలీ లీపి, రైటర్‌ సహాయంతో పరీక్షలుకు హాజరయ్యేది. ఎడ్యుకేషన్‌కు సంబంధించి దర్యాపూర్‌కు చెందిన ప్రొఫెసర్ ప్రకాష్ తోప్లే పాటిల్  దత్తత తీసుకున్నారని శంకర్‌బాబా వెల్లడించారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)