Breaking News

హ్యాట్సాప్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌..! 88 ఏళ్ల వయసులో వీధుల్లో..

Published on Wed, 07/23/2025 - 13:16

కొందరు ఒక మంచి పనికి పూనుకుని ‍స్ఫూర్తిగా నిలుస్తారు. అది తన హోదా కంటే కాస్త దిగి చేయాల్సిందే అయినా వెనుకడుగు వేయరు. అంతేగాదు వృత్తి విరమణను కూడా పక్కనపెట్టి సేవకు విరామం ఉండదనే కొత్త అర్థం చెబుతారు. అలాంటి వ్యక్తి ఈ రిటైర్డ్‌ ఐపీఎస్‌ ఆఫీసర్‌..ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ఆనంద్‌ మహీంద్రా సైతం ఆయన విశాల హృదయానికి ఫిదా అయ్యి అతడి గురించి నెటింట షేర్‌ చేశారు. మరి ఆ వ్యక్తి ఎవరంటే..

అతడిని పరిశుభ్రతకు మారుపేరు, స్వచ్ఛ భారత్‌ ముఖచిత్రంగా పేర్కొనవచ్చు. అతడే చండీగఢ్‌లోని 88 ఏళ్ల రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి ఇంద్రజిత్‌ సింగ్‌ సిద్ధూ. ఆయన 1964 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి. పదవీ విరమణ చేసినా..ప్రజా సేవకు మాత్రం ఉండదనే కొత్త అర్థం ఇచ్చేలా ఓ మంచి పనికి ఉప్రక్రమించాడు సిద్ధూ. 

స్వచ్ఛ సర్వేక్షణ్‌ జాబితాలో చండీగఢ్‌ ర్యాంక్‌ చాలా తక్కువకు పడిపోయిందని, తానే ఆ పనికి పూనుకోవాలని నిశ్చయించుకున్నాడు. అందుకోసం అధికారులకు ఫిర్యాదు చేయడం కంటే..మార్పు మన నుంచి మొదలైతే అది నిశబ్ధంగా అధికారులను ప్రేరేపించేలా ప్రతిధ్వని చేస్తుందని విశ్వసించాడు ఈ రిటైర్డ్‌ ఆఫీసర్‌ సిద్ధూ. ఆ నేపథ్యంలోనే ఆయన తన రోజుని వీధుల్లో చెత్తను తీయడంతో ప్రారంభిస్తాడు. 

ఉదయం ఆరుగంటలకు చండీగఢ్‌ సెక్టార్‌ 49 వీధుల్లో ఓ బండిపై చెత్తను ఆయనే స్వయంగా కలెక్ట్‌ చేసుకుంటూ వెళ్తుంటారు. వయసు రీత్యా ఆయన ఈ వయస్సులో అంతలా కష్టపడాల్సిన పని కాదు. పైగా ఈ సమస్య గురించి ఫిర్యాదు చేసి వదిలేయొచ్చు కానీ అవేమి చేయలేదు సిద్ధూ. తానే చర్య తీసుకోవాలని సంకల్పించి ఇలా చెత్తని సేకరిస్తున్నాడు ఆయన. 

గుర్తింపు, వయసుతో సంబంధం లేకుండా నిరంతరం స్వచ్ఛ భారతే  తన లక్ష్యం అన్నట్లుగా వీధుల్లో చెత్తను తీస్తూ పరిశుభ్రతకు పెద్దపీట వేశారాయన. స్వచ్ఛ భారత్‌ స్పూర్తికి నిదర్శనంలా నిలిచాడు. అతడి అంకిత భావం, సమాజం పట్ల అతడి వైఖరి నెటిజన్లను సైతం ఫిదా చేసింది. అంతటి అత్యున్నత హోదాలో పనిచేసి కూడా ఎలాంటి డాబు దర్పం చూపకుండా సాదాసీదా వ్యక్తిలా చెత్త సేకరించడం అంటే అంత ఈజీకాదంటూ ఆ ఐపీఎస్‌ ఆఫీసర్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తూ పోస్టులు పెట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి:

(చదవండి: Dr Megha Saxena: డాక్టర్‌... ట్రీట్‌మెంట్‌..! కార్చిచ్చుకి సమూలంగా చెక్‌..)

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)