Breaking News

హైరాక్స్ ఫిట్‌నెస్ రేసులో 72 ఏళ్ల బామ్మ రికార్డు..!

Published on Thu, 03/26/2026 - 12:14

సాధారణంగా మారథాన్‌, ఫుల్‌ మారథాన్‌.. వంటి పలు రకాల ఫిట్‌నెస్‌ ఫార్మాట్‌లో వృద్ధులు సైతం పాల్గొని రికార్డులు తిరగరాశారు. వాటన్నింటకంటే ఇటీవల సరికొత్తగా హైరాక్స్ అనే ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ బాగా ప్రాచుర్యం పొందుతోంది. చాలా మంది ఫిట్‌నెస్‌ ఔత్సాహికులు ఈ ట్రెండ్‌ని ఆదరిస్తున్నారు కూడా. అయితే ఇది సాధారణ మారథాన్‌ వలే జస్ట్‌ పరుగు కాదు..మల్టీటాస్కింగ్‌ వర్కౌట్‌లుగా చెప్పొచ్చు. కాస్త క్లిష్టతరమైనది కూడా. అలాంటి కఠినమైన హైరాక్స్‌ ఫంక్షనల్‌ రేసింగ్‌ పోటీలో ఓ 72 ఏళ్ల మహిళ అవలీలగా రికార్డు నెలకొల్పింది. పైగా ఆమె తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్నప్పటికీ ఈ ఘనత సృష్టించడం విశేషం. ఎవరామె..? అంత ఏజ్‌లో ఆమెకు ఇదెలా సాధ్యమైందంటే..

స్కాట్లాండ్‌కి చెందిన 72 ఏళ్ల కరోల్‌ మున్నో అనే మహిళ ఈ ఘనతను సృష్టించింది. ఏకంగా మూడుసార్లు తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నప్పటికీ ఈ హైరాక్స్‌ ఫిట్‌నెస్‌ రేసులో రికార్డు నెలకొల్పిందామె. ప్రపంచంలోని అత్యంత కఠినమైన ఫిట్‌నెస్‌ రేసులలో ఒకటైన హైరాక్స్‌లో రికార్డులు బద్దలు కొట్టి అంచనాలకు మించి సత్తా చాటిందామె. ఈ హైరాక్స్‌ రేసులో పాల్గొన్న అత్యంత పైబడిన వారిలో ఒకరిగా..తన సహచర క్రీడాకారిణిలో పోటీపడి ఈ రికార్డుని సృష్టించింది. 

ఈ రేసు వ్యాయామం, ఓర్పుతో కూడిన పరుగు. చాలా ఓర్పుతో చేయాల్సి పోటీ ఇది. ఆమెకు మూడు హిప్‌ రీప్లేస్‌మెంట్లు జరిగాయి. అంటే అధిక శారీరక ప్రభావం చూపే కార్యకలాపాలను పరిమితం చేసే పరిస్థితి ఆమెది..అయినప్పటికీ డోంట్‌ కేర్‌ అంటూ అవలీలగా ఈ క్లిష్టమైన రేసులో సత్తా చాటి స్ఫూర్తిగా నిలిచింది ఈ బామ్మ. 

హైరాక్స్‌ అంటే..
ఇదొక గ్లోబల్‌ ఇండోర్‌ ఫిట్‌నెస్‌ రేస్‌. ఇందులో ఎనిమిది.. ఒక కిలోమీటరు పరుగు తోపాటు స్లైడ్‌పుష్‌లు, రోయింగ్‌, బర్పీలు, వెయిటెడ్‌ లంజెస్‌ వంటి ఎనిమిది ఫంక్షనల్‌ వర్కౌట్లు కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. అంలే ఒకేసారి బలం, ఓర్పు, మానసిక స్థైర్యాన్ని పరీక్షించడానికి రూపొందించిన రేసింగ్‌ ఫార్మాట్‌ ఇది. సాంప్రదాయ మారథాన్‌లు లేదా జిమ్ పోటీల వలె కాకుండా, అత్యంత కఠినంగా, విభిన్నంగా ఉంటుంది. 

అలాంటి కఠినతరమైన ఈ రేసును వయసు పైబడి, అందులోనూ శస్త్ర చికిత్స నుంచి కోలుకుంటున్న వారికి పూర్తి చేయడం అత్యంత కష్టం. కానీ ఈ స్కాటిష్  బామ్మ అచంచలమైన పట్టుదల ఉంటే ఈ శారీరక ఇబ్బందులు పెద్ద అడ్డంకి కాదని ప్రూవ్‌ చేసింది. 

తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత పరిస్థితి..
సాధారణంగా తుంటి మార్పిడి శస్త్ర చికిత్స తర్వాత జీవనశైలి నెమ్మదిగా మారిపోతుంది. ముఖ్యంగా వృద్ధులు ఇలాంటి ఆపరేషన్‌లు చేయించుకుంటే..వారిని అధిక ప్రభావం చూపే వ్యాయమాల విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండమని సూచిస్తుంటారు వైద్యులు. అయితే ఈ 72 ఏళ్ల బామ్మ ఆ అభిప్రాయాన్నే అందరూ ఆశ్చర్యపోయేలా తిరగరాసింది. 

అయితే ఈ బామ్మ క్రమం తప్పకుండా వర్కౌట్ల శిక్షణ తీసుకోవడం తోపాలు పలు రకాల వ్యాయామాలు మార్చుతుండటం వల్ల హైరాక్స్‌లో సులభంగా రాణించగలిగేలా ఓర్పుతో కూడిన బలం సంపాదించుకుంది. అలాగే వృద్ధాప్యాన్ని పునర్నిర్వచించింది కూడా. కాగా ఈ సరికొత్త ఫిట్‌నెస్‌ ట్రెండ్‌ హైరాక్స్‌ ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి ఇతర నగరాల్లో ఎక్కువగా జరుగుతాయి.

(చదవండి: పర్యాటక అద్భుతం..'రివర్‌కేఫ్‌'గా వంతెన!)

 

Videos

బ్లడీ బాస్టర్డ్.. సామాన్యుడిపై TDP ఎమ్మెల్యే బూతు పురాణం

అడ్డంగా నరికేస్తా.. యూజ్ లెస్ ఫెలో ఆదిరెడ్డికి ధమ్కీ ఇచ్చిన వ్యాపారి

మార్కాపురం ఘోర రోడ్డు ప్రమాదం ఎలా జరిగిందంటే?

శవాన్ని తీసుకెళ్తుంటే 100 మంది దాడి చేశారు.. డిప్యూటీ సీఎంకి ఒకటే ప్రశ్న.

ఇన్వెస్టర్లకు జాక్పాట్ 1100% డివిడెండ్ ఇచ్చిన మైనింగ్ కంపెనీ

ఇన్వెస్టర్లకు పండగే లక్ష పెడితే 12 లక్షలు...ఒకటి కొంటే ఒకటి ఫ్రీ

YS జగన్ శ్రీరామనవమి శుభాకాంక్షలు

అమరావతిలో బాబు అవినీతి యజ్ఞం

4 గంటల్లోనే బంగారం ధరలు భారీగా పెరిగాయి..

దొరకాలి నా కొడుకు.. పెట్రోల్ పోసి తగలబెడతా

Photos

+5

కూతురితో టాలీవుడ్ నటి మంచు లక్ష్మీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో బైకర్ మూవీ టీమ్ (ఫోటోలు)

+5

జూ.ఎన్టీఆర్‌ సతీమణి ప్ర‌ణ‌తి బర్త్‌డే సెలబ్రేషన్స్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : ఒక చేయి.. ఆపన్నహస్తాలెన్నో! ఈ ఫోటోలు చూడండి

+5

నువ్వు దేవుడిచ్చిన వరం.. కూతురిని చూసి మంచు లక్ష్మీ ఎమోషనల్ (ఫోటోలు)

+5

డిఫరెంట్ లుక్స్‌తో షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

వావ్ అనేలా మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఫొటోలు

+5

IPL 2026: కెప్టెన్లంతా ఒకే చోట..! (ఫొటోలు)

+5

హనీమూన్ కాదు బడ్డీమూన్.. రష్మిక-విజయ్ ఇలా (ఫొటోలు)

+5

ఇదేం బిల్డప్‌ చంద్రబాబూ.. క్రెడిట్ చోరీ ఆగదా?: వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)