Breaking News

7 సీక్రెట్స్‌ : ప్రేమించే భార్య, కొంచెం లక్‌తో సెంచరీ కొట్టేశా!

Published on Fri, 10/17/2025 - 12:36

వందేళ్లు ఆరోగ్యంగా బతికిన ఓ పెద్దాయన నా దీర్ఘాయువుకు కారణాలివే అంటూ ఏడు చిట్కాలను పంచుకున్నాడు. అమెరికాకు చెందిన శతాధిక వృద్ధుడు సి లిబర్‌మాన్, జీవిత అనుభవాలు, ఆచరణ, ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అక్టోబర్ 13న ది వాషింగ్టన్ పోస్ట్ వ్యాసంలో 101 ఏళ్లు ఆరోగ్యంగా జీవించిన  సి లిబర్‌మాన్  తన దీర్ఘాయుష్షు రహస్యాలు సోషల్‌ మీడియాలో విశేషంగా నిలిచాయి.  ఈయన రెండో ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాడు.  ఈ సందర్బంలో ముఖ్యంగా  నాజీ జర్మనీపై శత్రువుల కాల్పుల నుండి బయటపడటం,  తీవ్రమైన మాంద్యం  పరిస్థితులు తదితర విషయాలను షేర్‌   చేశాడు. అంతేకాదు ఆరోగ్యపరంగా కూడా కష్టాలు తప్పలేదు. గుండెపోటు, కోమాలోకి వెళ్లి బయటపడటం లాంటి అద్భుతమైన జీవిత అనుభవాలు ఉన్నాయి.. 

ఆయన దీర్ఘాయువుకు కారణమైన ఏడు  చిట్కాలు

సంబంధాలపై దృష్టి (Focus on relationships):  బంధాలు అనుబంధాలపై దృష్టిపెట్టడం  ఈ విషయంలో తాను చాలా అదృష్టవంతుడినని తెలిపారు. 76 వైవాహిక జీవితంలో ఎంతో సన్నిహితంగా ఉండే భార్య డోరతీ(97), అద్భుతమైన ఇద్దరు పిల్లలు, మరెంతో ప్రేమగా ఉండే మనవరాళ్లు తన జీవితాన్ని ప్రభావితం చేశారన్నారు.  

సిగరెట్ తాగవద్దు (Don't Smoke) : ధూమపానం  చేయకపోవడమే ప్రదానమైంది. తన చిన్నతనంలో  తన  స్నేహితులు దాదాపు అందరూ ధూమపానం చేసినా తాను మాత్రం దాని జోలికి పోలేదని తెలిపారు. పెళ్లికాకముందు తన భార్య అప్పుడప్పుడు ధూమపానం చేసేదనీ , మెల్లిగా దాన్ని తాను మానిపించగలిగానని  చెప్పారు.

వ్యాయామం, ఆహారం (Exercise and eat healthy): ఎల్లప్పుడూ ఆరోగ్యంగా తినడానికి ప్రయత్నించాలని సూచించారు. అల్పాహారంగా పండ్లు, ఆహారంలో ఎక్కువగా చేపలు ఉంటాయి. దీంతో పాటు 14 సంవత్సరాల క్రితం ఫ్లోరిడాకు వెళ్లినప్పటినుంచి బీచ్‌లో నడవడం, స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టడం లాంటివి ఉన్నాయని చెప్పారు.

సానుకూల దృక్పథం (positive attitude): ఎన్ని కష్టాలొచ్చినా, ఎప్పుడూ నిరాశ చెందలేదు. కష్టాల్లో జీవిస్తూనే పరిస్థితులు మెరుగు పడతాయనే సానుకూల వైఖరి మంచి ఫలితాలనిస్తుందని చెప్పుకొచ్చారు.

తగిన వైద్య సంరక్షణ (appropriate medical care) : ఆరోగ్య పరిస్థితులకనుగుణంగా చికిత్స తీసుకోవాలి. ఈ విషయంలో శాస్త్రీయ పురోగతి, ఆధునిక వైద్యం అద్భుతాలు  నాకు చాలా లాభించాయి. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, వైద్య సలహాలు తీసుకోవాలన్నారు.  

నచ్చిన పని, మీనింగ్‌పుల్‌గా చేయడం (Do work you find meaningful): ప్రైవేట్ యాజమాన్యంలోని పత్రిక ఆస్బరీ పార్క్ సండే ప్రెస్‌కు ఎడిటర్‌గా పనిచేశా. 40  ఏళ్లకు పైగా జర్నలిస్ట్‌గా  చాలెంజింగ్‌ అండ్‌  రివార్డింగ్‌ జాబ్‌ అది చాలా ఇష్టం  చేశా. ఇప్పటికీ  బిజీగా ఉండటానికి  రాస్తాను.

కొంచెం అదృష్టం (Be a little lucky): నిజంగా భార్యతో చాలా అందమైన జీవితాన్ని గడిపాను. ఆమె  కొన్ని జ్ఞాపకశక్తి సమస్య ఉన్నా, రాత్రి నిద్రపోయే ముందు నన్ను ముద్దు పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోదు. మనల్ని ప్రేమించే, మన గురించి కేర్‌ తీసుకునే మనిషితో జీవించడం దీర్ఘాయువుకు చాలా తోడ్పడతుంది అంటారాయన. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)