హ్యాట్సాప్‌ బామ్మ.. ఆ వయసులో ఎంతటి స్థైర్యం..!

Published on Thu, 07/03/2025 - 16:21

మన పర్యావరణం కోసం ఓ విదేశీయురాలు ఎంతలా తపిస్తుందో తెలిస్తే విస్తుపోతారు. మన దేశంలో కూడా ఎందరో పర్యావరణ ప్రేమికులు, సామాజకి వేత్తలు అందుకోసం కృషి చేస్తున్నారు. వారంత తమ గడ్డపై నడుంబిడిస్తే..ఆ విదేశీయురాలు మన దేశంలోని ఒక సరస్సు కోసం ఐదేళ్లుగా కష్టబడుతోంది. ఆ సరస్సు అందాలను బావితరాలకు తెలిసేలా చేయాలని తన సేవను కొనసాగిస్తుంది. ఎవరామె అంటే..

68 ఏళ్ల ఎల్లిస్ హుబెర్టినా స్పాండర్‌మాన్ అనే డచ్‌ మహిళ కశ్మీర్‌ పర్యావరణాన్ని కాపాడేందుకు ఒంటిరిగా కృషి చేస్తోంది. ప్రకృతిపై ఉన్న ప్రేమే ఆ బామ్మను శ్రీనగర్‌లోని దాల్‌ సరస్సు అందాలను కాపాడేందు పురిగొల్పింది. అంతేగాదు రెండు దశాబ్దాలకు పైగా తన జీవితాన్ని ఆ సేవకే అంకితం చేశారు. నిజానికి ఆమె కశ్మీర్‌తో అనుబంధం ఎల ఏర్పడిందంటే..సుమారు 25 ఏళ్ల క్రితం తొలిసారిగా కాశ్మీర్‌ లోయను సందర్శించినప్పుడు ప్రారంభమైందట. 

దాని చుట్టు ఉన్న ప్రకృతి రమణీయతకు ఆకర్షితురాలైంది. అది ఎంతలా అంటే ఆ కాశ్మీర్‌లోనే శాశ్వతంగా ఉండిపోవాలన్నంతగా ప్రేమను పెంచుకుంది. అలా ఇక్కడే ఉండి ఈ ఐకానిక్‌ సరస్సు వైభవాన్ని కాపాడేందుకు శతవిధాల ప్రయత్నిస్తోంది. అంతేగాదు ఆమె ఆ సరస్సు నుంచి బాటిళ్లను, చెత్తను తీస్తున్న వీడియోలు కూడా నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి కూడా.

ఆ వీడియోలో ఎల్లిస్‌ మన స్వర్గాన్ని శుభ్రంగా, సహజంగా ఉండేలా చేతులు కలుపుదాం అని పిలుపునిచ్చింది. ఆ వీడియోని చూసిని నెటిజన్లు ఆమె నిస్వార్థ సేవను కొనియాడుతూ.. నిజంగా ఆ బామ్మ చాల గ్రేట్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ఈ సైక్లిస్ట్‌, ప్రకృతి ప్రేమికురాలు శ్రీనగర్‌ వీధుల గుండా వెళ్తూ..పర్యావరణ అనుకూల జీవనం, ఆరోగ్యకరమైన అలవాట్ల గురించి అవగాహన కల్పిస్తోందామె. 

స్థానికులు, పర్యావరణ వేత్తులు ఆ బామ్మ సేవనిరతికి మంత్ర ముగ్దులవుతున్నారు. ఎంత ధైర్యవంతమైన మహిళ, ఈ వయసులో ఆమె అభిరుచి,  లక్ష్యం మమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంది అంటూ ఆమె మార్గంలో నడిచే ప్రయత్నం చేస్తున్నారు వారంతా.  

 

(చదవండి: Zohran Mamdani: 'చేత్తో తినడ'మే ఆరోగ్యానికి మంచిది..! పరిశోధనలు సైతం..)

 

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)