ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌లతో తస్మాత్‌ జాగ్రత్త..!

Published on Sun, 09/21/2025 - 17:22

నయా ట్రెండ్‌గా నానో బనానా ఏఐ పోటోల సందడి మాములుగా లేదు. ఈ ట్రెండ్‌ చీరల దగ్గర నుంచి నవరాత్రుల సెలబ్రేషన్స్‌ వరకు పాకేసింది. ఏఐ జనరేటెడ్‌ ఇమేజ్‌ ఓ అద్భుతాన్ని సృష్టిస్తున్నా.. మన గోప్యతకు ముప్ప తప్పదనేది గ్రహించాలి. నిజానికి ఇది ఎంతవరకు ఉపయోగించడం మంచిదనేది సవివరంగా తెలుసుకోవాలి లేదంటే ఇబ్బందులు తప్పవని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. మన వ్యక్తిగత ఫోటోలను నచ్చిన విధంగా ఈ సరికొత్త ట్రెండ్‌ సాయంతో చూసుకోవడం అనేది వావ్‌..! అనిపిస్తున్నా..కొంత ప్రమాదం కూడా లేకపోలేదన్నది జగమెరిగిన సత్యం. ఎందుకంటే..

మన ఫోటోలను ఏఐ ఫ్లాట్‌ఫామ్‌కి అప్పగించడం వల్ల గోప్యత నుంచి సామాజిక హాని వరకు చాలా గణనీయమైన ప్రమాదాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ ట్రెండ్‌ హవా నడుస్తుందని మీ వ్యక్తిగత ఫోటోలను అప్పగించే ముందు ఎదురయ్యే ప్రమాదాలను గురించి కూలంకషంగా తెలుసుకోవడం అత్యంత ముఖ్యమని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటంటే..

AI జనరేటర్‌లకు ఫోటోలను ఫీడ్ చేయడం వల్ల కలిగే  ప్రమాదాలు..

డీప్‌ఫేక్ క్రియేషన్:
ఏఐ మీ ఫోటోలను ఉపయోగించి నమ్మదగిన డీప్‌ఫేక్‌లను సృష్టించగలదు. ఫలితంగా మీ గుర్తింపుకు, ప్రతిష్టకు నష్టం, పైగా వేధింపులు కూడా ఎదురయ్యే ప్రమాదం లేకపోలేదు. ముఖ్యంగా నానో బనానా ఏఐ జెనరేటెడ్‌ చిత్రాల వల్ల ఇది మరింత ఎక్కువ.

ఫోటోలపై నియంత్రణ కోల్పోవడం
ఒక్కసారి ఏఐ  జనరేటర్లకు ఫోటోలను అప్‌లోడ్‌ చేసినట్లయితే. .అవి ఎలా ఉపయోగించుకుంటున్నారనేది తెలియదు. పైగా ఆ చిత్రాల సాయంతో లొకేషన్‌ డేటా, వ్యక్తిగత వివరాలు సామాజిక కనెక్షన్‌లతో సహా సమాచారాన్ని గ్రహించేస్తాయి. అదీగాక డిజిటలైజ్‌ చేసిన మీ చిత్రం అనంతంగా లేదా మీ అనుమతి లేకుండానే మారిపోవచ్చు. ఇది ఒకరకంగా హింసాత్మక, లేదా తప్పుదారి పట్టించే అవకాశం కూడా లేకపోలేదని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇమేజ్ ప్రామాణికత క్షీణించటం: ఇమేజ్‌ ప్రామాణికత నష్టపోతుంది. ఎందుకంటే నకిలీ ఫోటోల మధ్య ఏది అసలైనది అనేది గుర్తించడం కష్టమవుతుంది. ముఖ్యంగా జర్నలిజం, ప్రకటనలకు సంబంధించిన దృశ్య కంటెంట్‌లపై గణనీయమైన ప్రభావం చూపుతుంది.

అనుమతి లేకుండానే వాణిజ్య వినియోగం: AI ప్లాట్‌ఫామ్‌లో అప్‌లోడ్ చేసిన ఫోటోలను అనుమతి లేకుండానే వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. 

గోప్యతకు భంగం, డేటా దుర్వినియోగం: ఏఐలో అప్‌లోడ్‌ అయిన ఫోటోలు బయోమెట్రిక్‌ డేటాకు యాక్సెస్‌ అయ్యి మీ గుర్తింపుకు అంతరాయం ఏర్పడవచ్చు. అంతేగాదు కొన్ని కంపెనీలు ఈ ఫోటోలను ఇతరత్రగా షేర్‌ చేయడం లేదా విక్రయించే అవకాశం లేకపోలేదు.

వివక్షత, పక్షపాత ధోరణి: తరచుగా కొన్ని సమూహాలు స్టీరియో టైపిక్‌ మైండ్‌తో..  మీ ఫోటోని లోపభూయిష్ట నమునాలుగా ఫీడ్‌ చేసి వివక్షతకు ఆజ్యం పోయడమే గాక జాతిపరమైన ప్రొఫైలింగ్ లేదా సవరణలతో అందం ప్రమాణాలను వక్రీకరించే సమస్యలు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు.

(చదవండి: ఆ గ్రామంలో అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడతారు..!)

 

Videos

నామినేషన్ కేంద్రాల వద్ద రాళ్ల గుట్టలు.. YSRCP నేతలే టార్గెట్..!

టైగర్ ష్రాఫ్ కేసులో కొత్త కోణాలు..

ఏపీ మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు దృష్టి..

పచ్చ కుట్ర జోరు.. రూ.600, బిర్యానీ ప్యాకెట్లు.. ఎన్నికల వేళ విద్యార్థులకు ఎర..

గుర్తుపెట్టుకో అనిత.. మేమిచ్చే రిటర్న్స్ గిఫ్ట్ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడుద్ది

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు

వీళ్లు అసలు పోలీసులా రౌడీలా... YSRCP నేతలపై దాడులు.. సజ్జల స్టాంగ్ రియాక్షన్

అర్ధరాత్రి కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్.. పల్నాడులో హైటెన్షన్...

ఏపీలో నేటి నుంచి పరిషత్ పోరు.. నామినేషన్ల వేళ టెన్షన్!

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

Photos

+5

అపరంజి బొమ్మలా నభా నటేశ్ (ఫొటోలు)

+5

ఏపీలో ప్రసిద్ధి చెందిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎక్కడో తెలుసా?

+5

విజయవాడ : భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి (ఫొటోలు)

+5

విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన సెలెబ్రెటీలు (ఫొటోలు)

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌