Breaking News

శ్వాసకోశ వైఫల్యం: బతికే ఛాన్సే లేదన్నారు! కట్‌చేస్తే..

Published on Thu, 05/21/2026 - 10:45

ఊపిరితిత్తులు ఏ కారణం చేతనైన ఇన్ఫెక్షన్‌కు గురై పనిచేయడం మానిస్తే..రెస్పిరేటరీ ఫెయిల్యూర్" లేదా శ్వాసకోశ వైఫల్యం అంటారు. ఆ పరిస్థితుల్లో రోగి బతికి బట్టకట్టే అవకాశమే ఉండదు. సింపుల్‌గా చెప్పాలంటే చాలా క్లిష్టమైన పరిస్థితి. కానీ ఓ రోగి అంత క్రిటికల్‌ స్టేజ్‌లో ఉండగా అత్యాధునిక వైద్య విధానంతో ప్రాణంపోసి సరికొత్త చికిత్సా విధానానికి నాంది పలికారు. 

అసలేం జరిగిందంటే..55 ఏళ్ల వైద్యుడు తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం బహుళ అవయవాల సమస్యలతో బాధపడుతున్నాడు. అతని ఊపిరితిత్తులు తీవ్ర ఇన్ఫెక్షన్‌ బారినపడటంతో సెప్టిక్‌ షాక్‌కి గురై(శరీరంలో రక్తపోటు ప్రమాదకర స్థాయికి పడిపోయే ప్రాణాంతక పరిస్థితి) వారాల తరబడి పోరాటం అనంతరం అత్యాధునిక ఆస్పత్రికి హుటాహుటినా తరలించారు. 

అక్కడ వైద్యులు రోగిని వెంటిలేటర్‌, ప్రోన్‌ వెంటిలేషన్‌తో సహా అన్ని రక్షణా చర్యలతో చికిత్స అందించారు. ఎంత ప్రయత్నించినా..అతడి పరిస్థితి మరింత దిగజారడంతో ప్రముఖ రెస్పిరేటరీ నిపుణుల బృందం రంగంలోకి దిగింది. ఆ బృందం ఆ వైద్యుడికి ECMO అనే ప్రాణాన్ని నిలబెట్టే చికిత్సు అందించారు.

ECMO అంటే..
ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) అనేది ప్రాణాలను కాపాడే ఒక యాంత్రిక జీవ సహాయక విధానం. ఇది రోగి రక్తాన్ని నిరంతరం శరీరం బయట ఉన్న కృత్రిమ ఊపిరితిత్తులకు పంప్ చేసి, ఆక్సిజన్‌ను జోడించి, కార్బన్ డయాక్సైడ్‌ను తొలగించి, తిరిగి రక్తాన్ని పంపుతుంది. ECMO బలహీనపడుతున్న గుండెలకు, ఊపిరితిత్తులకు విశ్రాంతి తీసుకుని, కోలుకోవడానికి సమయం ఇస్తుంది.

అతడిని  అనేక వారాల పాటు ICU, CTVS, IDలలో ఉంచి చికిత్స అందించారు. క్రమంగా, అతని ఊపిరితిత్తులు, ఇతర అవయవాల పనితీరు మెరుగుపడింది. ఆ తర్వాత  ECMO మద్దతును క్రమంగా తొలగించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే  ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అతను ఇప్పుడు మునపటిలా యథాస్థితికి వచ్చాడని వెల్లడించారు వైద్యులు. 

ఇలా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌ బారినపడి ఇతర అవయవాలు పనిచయుండా విశ్రాంతి స్థితికి వచ్చేసినప్పుడు ఈ ECMO  ఒక కృత్రిమ గుండె , ఊపిరితిత్తుల మాదిరిగా సహాయక వ్యవస్థగా పనిచేస్తుందని చెబుతున్నారు. తద్వారా రోగి ప్రాణాలను రక్షించగలమని అన్నారు.

(చదవండి: మండుటెండలకు ఎలాంటి ఫుడ్‌ మంచిదంటే..!)

 

 

Videos

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా

మృత్యు మేఘాలు వచ్చేసాయ్.. జాగ్రత!

క్లైమాక్స్ చూస్తే షాక్ అవుతారు.. ఉప్పెన కి మించి TWIST

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులో భారీ అగ్నిప్రమాదం

పుల్వామా ఉగ్రదాడి మాస్టర్ మైండ్ హమ్జా హతం

గుర్తుపెట్టుకో చంద్రబాబు.. ఇవే నీకు చివరి ఎన్నికలు..

నిప్పుల కుంపటి..! తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగిన ఉష్టోగ్రతలు

బండి భగీరథ్ సరెండర్ కాలేదు.. అరెస్ట్ చేశాం : రేవంత్ రెడ్డి

బొంతు శ్రీదేవితో మాకు ప్రాణహాని.. సీఎం సార్ మమ్మల్ని కాపాడండి

మరో వివాదంలో సీఎం విజయ్

Photos

+5

డేవిడ్ రెడ్డి టీమ్‌తో మంచు మనోజ్ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

వడ్డే నవీన్ రీ ఎంట్రీ.. త్రిమూర్తులు టీజర్ లాంఛ్‌ (ఫోటోలు)

+5

వాటికన్ సిటీలో నయనతార దంపతుల సందడి.. ఫోటోలు

+5

చిరంజీవి 158వ మూవీ లాంచ్‌ (ఫోటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో డేంజర్ ఎండలు.. అల్లాడిపోతున్న జనం (ఫొటోలు)

+5

‘పెద్ది’ కష్టం చూశారా? అయితే ఈ ఫోటోలు చూడాల్సిందే

+5

సింప్లీ సూపర్బ్‌ అనిపించేలా మహేశ్‌బాబు మేనకోడలు (ఫోటోలు)

+5

తిరుమలకు పోటెత్తుతున్న భక్తులు (ఫొటోలు)

+5

ఫుల్ హ్యాపీగా త్రిష.. అటు విజయ్ ఇటు సూర్య (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ కూతురి బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)