Breaking News

అరుదైన కేన్సర్‌లతో పోరాడిన యువ యోధురాలు..!

Published on Fri, 02/20/2026 - 11:01

మహమ్మారి కేన్సర్‌ ఎంతటి బలవంతుడినైన బలహీనుడిగా మార్చేస్తుంది. అంతలా మానసికంగా, శారీరకంగా ఢీలా పడేలా చేసే వ్యాధిని..19 ఏళ్ల అమ్మాయి అలుపెరగని పోరాటం చేసి..మట్టికరిపించింది. ఎందరో కేన్సర్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలవడమే గాక..ప్లీజ్‌ పోరాడండి అని ధైర్యం చెబుతోంది. యువ కేన్సర్‌ వారియర్‌ అని అందరిచేత ప్రశంసలందుకుంటోంది. 

ఆ అమ్మాయే 19 ఏళ్ల లకితా ఫిద్రా..కెన్యాకు చెందిన ఆమెకు ఐదేళ్ల వయసులో ఉండగా తండ్రి కేన్సర్‌తో మరణించాడు. ఒంటరి తల్లి పెంపకంలో సాగుతున్న ఆమె జీవితం సరిగ్గా పదేళ్ల వయసులో ఊహించని మలుపు తిరిగింది. ఒకరోజు ఆటలు ఆడుకుంటుండగా, సడెన్‌గా కుడిమోకాలులో విపరీతమైన నొప్పి..అల్లాడిపోతోంది. తీరా వైద్యుల వద్దకు తీసుకువెళ్తే..వాళ్లు నార్మల్‌ సమస్యగానే భావించి చికిత్స అందిస్తున్నారు. 

ఎప్పుడైతే ఆమె కుటుంబ చరిత్రలో తండ్రి అత్త సార్కోమా కేన్సర్‌ బాధితులని తెలిసిందో..వెంటనే అనుమానంతో డాక్లర్లు వైద్య పరీక్షలు చేయగా..తీవ్రమైన ఆస్టియోసార్కోమా కేన్సర్‌ నిర్థారణ అయ్యింది. స్కానింగ్‌లో ఆమె కుడి తొడ ఎముకలో ఈ కేన్సర్‌ కణితిని గుర్తించారు. దాంతో వైద్యులు కీమోథెరపీ చేయించి,  లింబ్ సాల్వేజ్ సర్జరీ చేశారు.  ఈ ప్రక్రియలో మోకాలి కీలును టైటానియం ఇంప్లాంట్‌తో భర్తీ చేశారు. ఆ తర్వాత రెండేళ్లకు హాయిగా స్కూల్‌కి వెళ్లి..యథావిధిగా చదువుకోడం ప్రారంభించింది. 

మళ్లీ ఆ మహమ్మారి 2020లో దాడి చేసింది. ఈసారి ఆమె కాలుని పూర్తిగా తొలగించక తప్పలేదు. అదే ఏడాది అదనపు కీమోథెరపీ, ఎముకమజ్జ మార్పిడి జరిగాయి. ఆమె సొంత స్టెమ్‌ సెల్స్‌ ఉపయోగించి మొట్టమొదిటి మార్పిడి చేశారు. దాదాపు వందరోజులపైనే ఆస్ప్రత్రిలో చికిత్స పొందింది. అక్కడితో ఆ కేన్సర్‌ విజృంభణ ఆగలేదు. ముచ్చటగా మూడోసారి 2022లో, ఆమెకు మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అభివృద్ధి చెందింది. ఇది అతి తీవ్రమైన ఎముక మజ్జ రుగ్మత.

ఇది మళ్లీ దాడిచేసే అరుదైన కేన్సర్‌వ్యాధి.  అయితే ఈసారి ఆమెకు అండగా తల్లి నిలబడింది. తల్లి ఎముకమజ్జ మార్పిడితో లకితాకి చికిత్స అందించారు. ఈప్రక్రియ విజయవంతమైంది. ఇక్కడ లకితా మూడోసారి ఎదుర్కొన్న తీవ్రమైన ఎముకమజ్జ మార్పడి..బహుళ కేన్సర్‌లకు దారితీసే జీవితకాల ప్రమాదం. కానీ ఆమె జన్యువులు దూకుడు లేకుండా చికిత్సా వ్యూహానికి అనుమతించి..తగ్గుముఖం పట్టడం విశేషం. అయితే ఆమెకు సదా వైద్యు పర్యవేక్షణ తప్పనిసరి. 

కనీసం రెండు మూడేళ్ల కొకసారి కేన్సర్‌ పరీక్షలు చేయిచుకోక తప్పదు. ఇన్ని కష్టాల మధ్య చదువుని నిర్లక్ష్యం చేయలేదు. ఆమె ఇప్పుడు సైకాలజీ, సామాజిక శాస్త్రం, సాహిత్యం ఏ లెవెల్‌ను చదువుతోంది. పైగా విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించాలనే యోచనలో ఉంది. తాను పరుగెత్తలేకపోయినా, జిమ్నాస్టిక్స్‌ చేయలేకపోతేనేం..డ్యాన్స్‌ చేయగలను, పేయింటింగ్‌ వేయగలను అంటోంది. పునరావృతమయ్యే బోన్‌ కేన్సర్‌,  లి-ఫ్రామిని సిండ్రోమ్‌పై ధైర్యంగా పోరాడిని ధీరురాలిగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే కేన్సర్‌ బాధితుల్లో స్థైర్యాన్ని నింపేలా గొప్ప సందేశాన్ని కూడా అందిస్తుంటుంది. మీరు కేన్సర్‌ రోగిగా ఆస్పత్రల్లో గడపడం కష్టమే అయినపపటికీ తెలియన ధైర్యంతో సాగుతారు. ఆ వ్యాధని చూసి భయపడినప్పటికీ స్ట్రాంగ్‌గా మారతారు. అప్పుడు తెలుస్తుంది మీరు రోగి కాదు..హీరో అనే సందేశాలతో వాళ్లను వీరోచితంగా కేన్సర్‌పై పోరాడేలా చేస్తుంది లకితా. 

(చదవండి: నిజమైన వ్యక్తిత్వ వికాసం మొదలయ్యేది అప్పుడే..!)

 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)