Breaking News

హాట్‌టాపిక్‌గా ఆ విద్యార్థి లేవనెత్తిన ప్రశ్న..!

Published on Fri, 06/05/2026 - 13:40

ఓ యువ విద్యార్థి లేవనెత్తిన సందేహం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. జార్ఖండ్‌కు చెందిన పదిహేడేళ్ల సార్థక్‌ సిద్ధాంత్‌ 12 వ తరగతి చదువుతున్నాడు. సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ ఈ ఏడాది 12వ తరగతి పరీక్ష మూల్యాంకనానికి ఆన్‌ స్క్రీన్‌ మార్కింగ్‌ను ప్రవేశపెట్టింది. తీరా ఫలితాలు వచ్చిన తర్వాత చాలామంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయని, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని ఆరోపించారు. 

కాస్త లోతుగా విశ్లేషించాలని సీబీఎస్‌ఈ విడుదల చేసిన డాక్యుమెంట్లు, పాత టెండర్లను డౌన్‌లోడ్‌ చేసుకుని పరిశీలించి చూశాడు సార్థక్‌. నిబంధనల మార్పు జరిగిందని, కొన్ని క్లాజులను సడలించారని, మరిన్ని లోపాలు కూడా ఉన్నాయని తన బ్లాగ్‌లో వెల్లడించాడు. దీంతో ఒక్కసారిగా అతడి పేరు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. అధికారులు అప్రమత్తమయ్యారు. 

సార్థక్‌ ఆరోపించిన అంశాలను సవివరంగా తెలుసుకోదలచి అతడినే సీబీఎస్‌ఈ పార్లమెంటరీ ప్యానల్‌కి ఆహ్వానించారు. కమిటీలో సీబీఎస్‌ఈ చైర్మన్‌ రాహుల్‌ సింగ్‌తో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. సార్థక్‌ ఇచ్చిన ప్రజెంటేషన్‌లో తాను గుర్తించిన పలు లోపాలను వారికి వివరించాడు. మొత్తానికి జార్ఖండ్‌ విద్యార్థి లేవెనెత్తిన ప్రశ్న దేశవ్యాప్తంగా ఉన్న విద్యావ్యవస్థ పరీక్షగా మారింది.

(చదవండి: ‘గ్రాండ్‌ఫేర్‌వెల్‌’.. ఆ మాస్టారుకి గురుదక్షిణగా ఏకంగా కారు!)

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)