Breaking News

ఒత్తిడిని చిత్తు చేసి...ఆల్‌ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది

Published on Tue, 06/17/2025 - 10:21

‘సమస్య నీలోనే ఉన్నప్పుడు...దానికి పరిష్కారం కూడా నీలోనే ఉంటుంది’... ఇది తత్వం కాదు. నిజం. ‘నీట్‌’కు ప్రిపేర్‌ అవుతున్న క్రమంలో అవిక ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చేది. కన్నీళ్లు తుడుచుకున్నాక... ఒత్తిడిని దూరం చేసే దారి కనిపించింది. ఇక ఎప్పుడూ ఆమె ఏడవ లేదు. ఇప్పుడు ఆల్‌ ఇండియా స్థాయిలో విజేతగా నిలిచింది.

‘చిన్నప్పటి నుంచి నేను డాక్టర్‌ కావాలనుకునేదాన్ని’ అంటున్న పదిహేడు సంవత్సరాల అవిక అగర్వాల్‌ జాతీయ వైద్య ప్రవేశ పరీక్ష ‘నీట్‌’లో 5వ ర్యాంక్‌ సాధించింది.  వైద్యుల కుటుంబంలో పుట్టిన అవిక ఆ వృత్తి విలువను ప్రత్యక్షంగా చూసింది.

ఫరిదాబాద్‌కు చెందిన అవిక పదవతరగతి వరకు ఢిల్లీలో చదివింది. వృత్తి జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ఎప్పుడూ ప్రశాంతచిత్తంతో కనిపించే తల్లిదండ్రులను చూడడం తనకు ఇష్టం.

‘వారు ఎంతోమందిని బాధ నుంచి విముక్తి చేశారు. జీవితంపై ఆశ కల్పించారు’ అంటుంది తల్లిదండ్రుల గురించి. తల్లిదండ్రులను చూసి డాక్టర్‌ కావాలనుకున్న అవిక పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్న క్రమంలో ఒత్తిడిని తట్టుకోలేక ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. కొద్దిరోజుల్లోనే ఆ ఒత్తిడికి పరిష్కారాన్ని కూడా కనిపెట్టింది. తనకు ఇష్టమైన టేబుల్‌ టెన్నిస్‌ ఆడడం ద్వారా ఒత్తిడి నుంచి బయటపడేది.

యుద్ధంలోనే కాదు పరీక్షల యుద్ధంలోనూ వ్యూహం(స్ట్రాటజీ) అనేది ముఖ్యం. ‘మేజర్, మైనర్‌ గోల్స్‌గా నా స్ట్రాటజీని విభజించుకున్నాను. నీట్‌ అనేది నా మేజర్‌ గోల్‌. మైనర్‌ గోల్‌...ప్రతిరోజూ ఇంటికి వెళ్లిన తరువాత విన్న పాఠాలను మననం చేసుకోవడం. డౌట్స్‌ లేకుండా చూసుకోవడం. క్వశ్చన్స్‌ ప్రాక్టీస్‌ చేయడం’ అంటుంది అవిక. 

(చదవండి: మోడ్రన్‌ బామ్మ..! ఆమె చేసే వర్కౌట్లు చూస్తే షాకవుతారు!)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)