Breaking News

డాక్టర్‌ అవసరం లేకుండానే కంటి పరీక్షలా? 17 ఏళ్ల కుర్రాడి అద్భుతం!

Published on Sat, 10/31/2026 - 10:06

కంటిచూపు తగ్గినా.. కళ్లు మంటగా ఉన్నా.. చూపులో మార్పులు కనిపించినా వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించడం మంచిది. కానీ గ్రామీణ ్రపాంతాల్లో చాలామందికి కంటి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉండదు. ఆర్థిక ఇబ్బందులు, వైద్య సదుపాయాల కొరత కూడా ఇందుకు కారణం.

ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఓ 17 ఏళ్ల విద్యార్థి చేసిన ఆలోచనే ఓ  కొత్త ఆవిష్కరణకు నాందిపలికింది. స్మార్ట్‌ఫోన్‌  సాయంతో వ్యాధులను ముందుగానే గుర్తించే ఏఐ యాప్‌ను రూపొందించాడు. ఎంతోమందికి కంటి పరీక్షలు చేస్తూ అందరితో శభాష్‌ అనిపించుకుంటున్నాడు.

హరియాణాలోని గురుగ్రామ్‌కు చెందిన సిద్ధార్థ్‌ మనక్తాలా ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. అతడి అమ్మమ్మ కొన్నేళ్లుగా డయాబెటిక్‌ రెటినోపతి సమస్యతో బాధపడుతోంది. ఇదే సిద్ధార్థ్‌ని కంటి ఆరోగ్యం గురించి ఆలోచించేలా చేసింది. చాల మంది కంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ.. ఆర్థిక ఇబ్బందులు, రవాణా సదుపాయం, దూరం వంటి కారణాల వల్ల వైద్య పరీక్షలకు దూరమవుతున్నారని తెలుసుకున్నాడు. దీంతో అందరికీ అందుబాటులో ఉండేలా కంటి పరీక్షలు నిర్వహించాలనుకున్నాడు.

ఫోన్‌ తోనే ఏడు టెస్టులు!
అలా సిద్ధార్థ్‌ రూపొందించిన యాప్‌ పేరు ‘ఐ స్పై’. కృత్రిమ మేధ సాయంతో పనిచేసే ఈ యాప్‌ స్మార్ట్‌ఫోన్‌ లో తీసిన చిత్రాలను విశ్లేషిస్తుంది. కంటి బయటి భాగంతో పాటు రెటీనాను పరిశీలిస్తుంది. కంటిశుక్లం, కండ్లకలక, గ్లాకోమా, డయాబెటిక్‌ రెటినోపతి వంటి ఏడు రకాల కంటి సమస్యలను గుర్తించేలా ఈ యాప్‌ పనిచేస్తుంది. సాధారణ ఆండ్రాయిడ్‌ ఫోన్లలోనూ మూడు సెకన్లలోపు ఫలితాలను అందిస్తుంది. ఇంటర్నెట్‌ సదుపాయం లేకున్నా పనిచేయడం దీని మరో ప్రత్యేకత.

విఫలమైనా.. వెనక్కి తగ్గలేదు!
ఈ యాప్‌ని రూపొందించడంలో సిద్ధార్థ్‌కి ఎన్నో అవాంతరాలు వచ్చాయి. అయినా వైద్యులు, పరిశోధకుల సూచనలతో తిరిగి ప్రయత్నం చేస్తూ... ఆఖరికి ఐ స్పై యాప్‌ని రూపొందించాడు. సిద్ధార్థ్‌ ఈ యాప్‌ రూపకల్పనతోనే ఆగిపోకుండా గ్రామాలు, ప్రభుత్వ పాఠశాలలు, పరిశ్రమల్లో ఐ క్యాంప్‌లు నిర్వహిస్తున్నాడు. అంతేకాదు మందులు, అద్దాలు కొనుక్కోలేని వారికి క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా సేకరించిన డబ్బుతో సహాయం చేస్తున్నాడు.

ఈ ఆవిష్కరణకు సిద్ధార్థ్‌కు జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు లభించింది. ఐరిస్, ఇన్‌ సెఫ్‌ జాతీయ సైన్స్‌ ఫెయిర్‌లలో సిల్వర్‌ మెడల్స్‌ సైతం అందుకున్నాడు. భవిష్యత్తులో మరిన్ని భారతీయ భాషల్లో యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సిద్ధార్థ్‌ భావిస్తున్నాడు. చిన్నారుల్లో వచ్చే కంటి సమస్యలను ముందుగానే గుర్తించే ప్రత్యేక విభాగాన్ని కూడా రూపొందించాలనుకుంటున్నాడు.

ఇదీ చదవండి: జెన్‌ జెడ్‌ కొత్త భాష ఇదే! ఈ గుర్తులకు పూర్తి అర్థమేంటో తెలుసా!

Videos

ఆత్మకూరులో అర్థరాత్రి ఖాళీగా బ్యాలెట్ బాక్సులు... అసలు ఏం జరుగుతుంది

ఆసుపత్రి బెడ్‌పై రాక్షసుడు.. కాళ్లు తొలగించే ఆలోచనలో డాక్టర్లు

దారుణం..ఇదేనా మానవత్వం అంటే..?

రిగ్గింగ్ చేస్తా నా కొడ*** ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరుడు బరితెగింపు వ్యాఖ్యలు

తెలంగాణపై అమిత్ షా గురి.. చిరంజీవి, రామ్ చరణీతో భేటీ

ఏపీకి బిగ్ అలర్ట్.. ముంచుకొస్తున్న మురసు తుఫాన్

బెంగళూరు హాస్పిటల్‌కి చేరుకున్న వైఎస్ జగన్

ఏకంగా ఒక రంపం తీసుకుని... బాలిక ఘటనపై జగన్ స్ట్రాంగ్ రియాక్షన్

పులివెందులలో రీపోలింగ్ జరపాలని హైకోర్టులో అవినాష్ రెడ్డి పిటిషన్...

రాప్తాడు బాలిక ఘటన పై వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్

Photos

+5

'సీన్' కోసం నజ్రియా బిజీ బిజీగా (ఫొటోలు)

+5

ఆషిక నవ్వితే నక్షత్రాలు మెరిసినట్లే (ఫొటోలు)

+5

మాల్దీవుల్లో 'ధురంధర్' బ్యూటీ సారా అర్జున్ (ఫొటోలు)

+5

జిమ్-ఫుడ్-ఫ్యామిలీ.. అనసూయ అక్టోబర్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (నవంబర్ 01 -నవంబర్ 07)

+5

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ సొంతం చేసుకున్న భార‌త్‌ (ఫోటోలు)

+5

వైట్‌ డ్రెస్‌లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్.. (ఫోటోలు)

+5

ఎన్నికల్లో పచ్చ కుట్రలు.. ఆర్వో ఆఫీసు ఎదుట వైఎస్‌ జగన్‌ నిరసన (ఫోటోలు)

+5

చరణ్-సుకుమార్ కొత్త సినిమా లాంఛనంగా ప్రారంభం (ఫొటోలు)