Breaking News

ఆటిజం ఉన్నా ఐక్యూలో ఘనం! 12 ఏళ్లకే మాస్టర్స్‌ డిగ్రీ

Published on Sun, 06/25/2023 - 10:06

మెక్సికోకు చెందిన ఈ పన్నెండేళ్ల బాలికకు చిన్నప్పటి నుంచి ఆటిజం సమస్య ఉంది. మూడేళ్ల వయసులో స్కూల్‌లో చేరిన తొలి నాళ్లలో తోటి పిల్లలు ఏడిపించేవారు. టీచర్లు కూడా ఈమె పట్ల పెద్దగా శ్రద్ధ చూపేవారు కాదు. నవ్విన నాప చేనే పండుతుంది అన్నట్లుగా ఇప్పుడు ఈమె ఏకంగా గణితంలో మాస్టర్స్‌ డిగ్రీ పరీక్షలకు సిద్ధమవుతోంది. ఈమె పేరు ఆధరా పెరెజ్‌ సాన్షెజ్‌. మెక్సికో సిటీలో పుట్టి పెరుగుతోంది. ఇప్పుడామె ఒకవైపు మాస్టర్స్‌ డిగ్రీ కోసం పాఠాలను చదువుకుంటూనే, తన తోటి పిల్లలకు, తన కంటే పెద్దవారికి కూడా లెక్కల్లో పాఠాలు చెబుతోంది.

మరోవైపు మెక్సికన్‌ స్పేస్‌ ఏజెన్సీ కోసం కూడా సేవలందిస్తోంది. ఏనాటికైనా అమెరికన్‌ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’తో కలసి పనిచేయాలనేదే తన లక్ష్యమని చెబుతోంది. ఐదేళ్ల వయసులో ప్రాథమిక విద్య పూర్తి చేసుకున్న ఆధరా, మరుసటి ఏడాదిలోనే మిడిల్‌ స్కూల్, హైస్కూల్‌ పరీక్షలను ఒకే ఊపులో గట్టెక్కింది. ఐదేళ్ల వయసులోనే పిరియాడిక్‌ టేబుల్‌ కంఠస్థం చేయడమే కాకుండా, కఠినమైన ఆల్‌జీబ్రా సమస్యలను అలవోకగా పరిష్కరిస్తుండటం చూసి, ఆధరా తల్లి ఆమెను థెరపిస్ట్‌ వద్దకు తీసుకువెళ్లింది. చికిత్సతో ఆమె పరిస్థితి మెరుగుపడింది.

వయసుకు మించిన పరీక్షల్లో వరుస ఉత్తీర్ణతలు సాధిస్తూ, గత ఏడాది మాస్టర్స్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశం సాధించింది. ఆధరాకు చికిత్స చేసిన థెరపిస్ట్‌ ఆమెలోని ప్రతిభను గుర్తించి, ఆమెను ‘సెంటర్‌ ఫర్‌ అటెన్షన్‌ టు టాలెంట్‌’ (సీఈడీఏటీ)కు పంపారు. అక్కడ జరిపిన పరీక్షల్లో ఆమె ఐక్యూ 160 అని నిపుణులు తేల్చారు. అంటే, ఆమె ఐక్యూ ఐన్‌స్టీన్, స్టీఫెన్‌ హాకింగ్‌ల కంటే ఎక్కువే! ప్రస్తుతం అరిజోనా యూనివర్సిటీ ఆమెకు స్కాలర్‌షిప్‌ ప్రకటించినా, వీసా ఆలస్యం కావడంతో అక్కడ చేరడం వాయిదా పడింది. ప్రస్తుతం చదువుకుంటున్న మాస్టర్స్‌ డిగ్రీ పూర్తయితే, అరిజోనా యూనివర్సిటీలో ఆస్ట్రోఫిజిక్స్‌ కోర్సులో చేరనుంది.

(చదవండి: 'అమ్మా నన్ను మన్నించు'.. హాకీ దిగ్గజం ధనరాజ్‌ పిళ్లై)

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)