Breaking News

ఫ్లైట్‌ అటెండెంట్‌గా 12 ఏళ్ల చిన్నారి..! ఎట్టకేలకు నెరవేరిన కల..

Published on Fri, 10/02/2026 - 12:14

ఓ చిన్నారి ఫ్లైట్‌ అటెండెంట్‌గా తన కోరిక నెరవేర్చుకుంది. ఇదేంటి ఇంత చిన్నవయసులో ఫ్లైట్‌ అటెండెంట్‌గా సేవలా అని విస్తుపోకండి. ఇది ఉద్యోగం కాదు..చావు అంచులదాక వెళ్లొచ్చి..అనారోగ్యాన్ని జయించినందుకు గుర్తుగా ఇలా ఫ్లైట్‌ అటెండెంట్‌గా సేవలందిస్తూ సెలబ్రేట్‌ చేసుకుంది తన పునరాగమనాన్ని. ఆమె కథ ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతున్న వాళ్లకు స్ఫూర్తి. ఆ చిన్నారి కథేంటో చూసేద్దామా..!

ఆ చిన్నారే 12 ఏళ్ల త్రిషా ఓంగ్‌. ఆమె ఒకరోజు పాటు క్వాంటాస్‌ ఫ్లైట్‌ అటెండెంట్‌గా మారింది. ఆమె బాల్యం అంతా అనారోగ్య సమస్యతో పోరాడటంతోనే సాగింది. ఆ చిన్నారి త్రిషా కేవలం నాలుగేళ్ల ప్రాయంలో తీవ్రమైన కిడ్నీ సమస్యలను ఎదుర్కొంది. జీవితం చాలా కష్టంగా ఉండేది. ప్రతి నిమిషం ఆస్పత్రులు, చికిత్సలు, నొప్పిలతో నరకంగా ఉండేది. అంతటి వేదనను తట్టుకోవడమే కాదు..ఇటీవలే కిడ్నీ మార్పిడి చికిత్స చేయించుకుని..ప్రాణాంత వ్యాధి నుంచి బయటపడింది. 

చివరకు తనకలను నేరవేర్చుకుంది. అందుకు మేక్‌ ఏ విష్‌ ఆస్ట్రేలియా అండ్‌ క్వాంటస్‌ సహకారం అందించింది. ఇంతకీ ఏంటా చిన్నారి చిరు కోరిక అంటే ఫ్లైట్‌ అటెండెంట్‌ అవ్వడం ఆమె ఆశయం. ఆ కలన నెరవేర్చుకునేలా సదరు విమానాయన సంస్థ సహకారం అందించింది. అలా ఒక్కరోజు ఫ్టైట్‌ అటెండెంట్‌గా త్రిషా ఆ విమానంలో సేవలందించింది. అందుకోసం ప్రత్యేకంగా కుట్టిన  అధికారిక క్వాంటాస్ యూనిఫాంలో వచ్చి మరి శిక్షణ, అత్యవసర విధానాల నుంచి విమానం నడపడంలో నైపుణ్యం,ప్రయాణికులకు సేవ చేయడం, సహాయపడటం వరకు ప్రతీది ఆస్వాదించిందామె. 

ఈ మేరకు సదరు ఎయిర్‌లైన్‌ అందుకు సంబంధించిన ఫోటో తోపాటు "ఒక కోరిక. ఒక జత రెక్కలు. గుర్తుండిపోయే రోజు," అనే క్యాప్షన్‌ జోడించి మరి ఇలా రాసుకొచ్చింది. ఫ్లైట్‌ అటెండెంట్‌గా ఆమె ప్రతి క్షణాన్ని ఆస్వాదించింది. చివరి దశ కిడ్నీ వైపల్యాన్ని అధిగమించి, విజయవంతంగా అవయవ మార్పిడి చేయించుకున్న ఆ చిన్నారి బలం, సానుకూలదృక్పథం ప్రతి ఒ‍క్కరిని ప్రేరరేపించింది. 

ఆమె కోరికను నెరవేర్చడంలో భాగమైనందుకు మేము గర్వపడుతున్నాం". అని సదరు ఎయిర్‌లైన్‌ పేర్కొంది పోస్ట్‌లో. కాగా, చిన్నారి త్రిష అడిలైడ్‌కు వెళ్లే ఒక వాణిజ్య విమానంలో బయలుదేరడానికి ముందు, ఫ్లైట్‌అటెండెంట్‌గా నిర్వర్తించాల్సిన పనుల్లో సహాయపడటంతో పాటు, విమానం ఎక్కుతున్న ప్రయాణికులను పలకరించి, భద్రతా ప్రకటనలు చేసి, క్యాబిన్‌లో చిరుతిండి అందించడంలో కూడా సహాయపడటం విశేషం.

ఇదీ చదవండి: అక్కడ దేవుడికి వ్యర్థాల నైవేద్యం..! ఆ ఆచారం వెనుకు అసలు కథ ఇదే..

 

Videos

ఒళ్ళు దగ్గర పెట్టుకోండి..! బాబు, పవన్ కు రోజా స్ట్రాంగ్ వార్నింగ్

టైగర్ టైగర్ అని అరవకండయ్యా బాబు.. పవన్ కళ్యాణ్ కు తెలిస్తే బోను పంపించి..

ధురంధర్ హీరోతో కల్యాణి..

మహిళల 75 కిలోల బాక్సింగ్ లో లవ్లీనాకు స్వర్ణం

ఆ క్షణం నేను ఆలోచించింది ఇదే.. పైలెట్ స్మిట్‌ మచ్చార్‌ తో మోదీ వీడియో కాల్

నగరిలో చంద్రబాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేత

తన స్వార్ధం కోసం నన్ను ఇరికించాడు

బీసీ రిజర్వేషన్ల విషయంలో జగన్ ను ప్రశ్నిస్తే బాబుకే నష్టం..

కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్న వరుణ్ తేజ్ దంపతులు

10,000 అడుగుల ఎత్తులో మనుషులే లేని చోట రాతి గోడలు

Photos

+5

అందంతో ఆకట్టుకుంటున్న కయాదు.. ఫొటోలు వైరల్‌

+5

అదిరిపోయే లుక్స్‌తో రాశి ఖన్నా..(ఫొటోలు)

+5

సెప్టెంబర్ జ్ఞాపకాలు షేర్ చేసిన అనసూయ.. (ఫోటోలు)

+5

చుడీదార్‌లో బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య.. (ఫోటోలు)

+5

కాంతారాకు ఏడాది.. హీరోయిన్‌ ఎమోషనల్‌ పోస్ట్ (ఫొటోలు)

+5

నడవలేని స్థితిలో సీనియర్ నటి శారద.. ఇలా మారిపోయిందేంటి? (ఫోటోలు)

+5

ఎల్లో కలర్ శారీలో విమలా రామన్ స్టన్నింగ్‌ లుక్స్‌.. (ఫొటోలు)

+5

చాన్నాళ్లకు కనిపించిన విజయ్‌ భార్య‌ సంగీత, కూతురు దివ్య (చిత్రాలు)

+5

తిరుపతి : వైభవంగా ప్రారంభమైన పోలేరమ్మ జాతర (ఫొటోలు)

+5

తెలంగాణ : నిర్మల్ లో సందడి చేసిన ప్రముఖ నటి శ్రీలీల (ఫొటోలు)