Breaking News

ఐఐటీ బాబా ట్రాక్‌ రికార్డ్‌ : 10,12వ తరగతి మార్కులు వైరల్‌

Published on Tue, 02/18/2025 - 15:58

ఉత్తరప్రదేశ్‌లోని  ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbh Mela)లో పాపులర్‌ అయిన 'ఐఐటీ బాబా' గుర్తున్నాడా? ఇంజనీర్ బాబాగా పేరొందిన అభయ్ సింగ్ ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని అందరి దృష్టిని ఆకర్షించింది. ప్రతిష్టాత్మక ఐఐటీ (IIT)బాంబేలో తెలివైన ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌ చదివి,  లక్షల జీతాన్నిచ్చే ఉద్యోగాన్ని వదిలి అభయ్ ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగుపెట్టాడు. ఆధ్యాత్మిక జ్ఞానంతో శాస్త్రీయ విజ్ఞానాన్ని మిళితం చేస్తూ తన విశిష్టమైన విధానంతో మహా కుంభ్‌లో భక్తులను కట్టిపడేశాడు.

తాజాగా  అభయ్‌ సింగ్‌  మరోసారి వార్తల్లో నిలిచాడు. విద్యార్థి దశలో అభయ్‌ అద్భుతమైన ట్రాక్‌ రికార్డు వైరల్‌గా మారింది. 10వ తరగతి, 12వ తరగతి మార్కుల షీట్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో  తెగ చక్కర్లు కొడుతోంది.  ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన అభయ్  తన 10వ తరగతిలో 93 శాతం, 12వ తరగతి పరీక్షలలో 92.4 శాతం మార్కులు సాధించాడట. ఈ స్కోర్లు అతని మేధో నైపుణ్యాన్ని మరింత హైలైట్  చేస్తున్నాయి. పలు మీడియా నివేదికలు వెలువడ్డాయి. అంతేకాదు 2008లో, అతను IIT-JEE పరీక్షలో 731 ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) సాధించాడని నివేదికలు సూచిస్తున్నాయి.  దీంతో ఈ టాలెంటే  అతడిని దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ అభ్యర్థులలో ఒకటిగా నిలిపిందిఅంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

ఇదీ చదవండి: బెల్లీ ఫ్యాట్‌ కరగాలంటే, ఈ ఐదు ఆసనాలు చాలు!

మహాకుంభ మేళా 2025ల దర్శనమిచ్చిన వివిధ సాధువులు , బాబాలలో ఆకర్షణీయంగా నిలిచిన వారిలో ఒకరు ఐఐటీయన్ బాబా అభయ్ సింగ్ ఒకరు. ఈయన హర్యానాకు చెందినవాడు. ఇంజనీర్ బాబా ఐఐటీ బాంబే నుండి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివిన తర్వాత, కెనడాలో మూడు సంవత్సరాలు పనిచేశాడు.  ఏడాది రూ. 36 లక్షల  ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు.. అభయ్ డిజైన్‌లో మాస్టర్స్ (MDs) కూడా చేశాడు అయితే, బాబా ఆ ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్ ఫోటోగ్రఫీలో కోర్సు చేశాడు. ట్రావెల్ ఫోటోగ్రఫీ   చేస్తున్న క్రమంలో అతనిలో మార్పుమొదలైంది. కొంతకాలం తన సొంత కోచింగ్‌ను ప్రారంభించాడు. 

 నాలుగేళ్లు డేటింగ్‌...కానీ 
నాలుగేళ్లు ఒక అమ్మాయితో డేటింగ్  కూడా  చేశాడు. తల్లిదండ్రుల  మధ్య  ఉన్న వివాదాలు చూసిన తన సంబంధాన్ని ఎప్పుడూ ముందుకు తీసుకెళ్లలేదని వెల్లడించాడు. ఇక్కడి నుండి ఆయన ఇంజనీరింగ్ వదిలి పూర్తిగా ఆధ్యాత్మికతకు వైపు మళ్లి బాబాగా మారాలని నిర్ణయించుకున్నాడు.తన జీవితమంతా మహాదేవ్‌కు అంకితం చేశానని   కూడా మీడియాకు తెలిపిన సంగతి తెలిసిందే. 
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)