Breaking News

ఏడు ఖండాలను చుట్టి వచ్చిన వందేళ్ల బామ్మ..!

Published on Wed, 12/04/2024 - 17:53

మన దేశంలో ఉండే పర్యాటక ప్రదేశాలను చుట్టిరావడమే కష్టంగా ఉంటుంది. ఎందుకంటే బడ్జెట్‌, జర్నీ ప్లాన్‌ అన్నీ అనుకూలంగా ఉంటేనే సాధ్యం. ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలు.. ఏ మూడో.. నాలుగో చుట్టి వచ్చి హమ్మయ్యా అనుకుంటాం. కానీ ఈ బామ్మ మాత్రం ఏకంగా ఏడు ఖండాలను చుట్టి రావాలనుకుంది. అక్కడ విభిన్న సంప్రదాయాలు, ప్రజల జీవనశైలిని గురించి తెలుకోవాలని ఆరాటపడింది ఈ బామ్మ. వృద్ధాప్యం సమీపిస్తున్న వెనక్కి తగ్గలేదు. చివరకు తాను అనుకున్నట్లుగానే ఏడు ఖండాలు చుట్టివచ్చి..అందిరిచే ప్రశంసలందుకుంది. ఆమె ఎవరంటే..

102 ఏళ్ల డోరతీ స్మిత్‌ అత్యంత సాహసోపేతమైన కలను నిజం చేసుకుని.. అద్భతమైన ఘనతను సాధించింది. మొత్తం ఏడు ఖండాలను సందర్శించి శెభాష్‌ అనిపించుకుంది. చాలాకాలంగా ఈ బామ్మ భూగోళాన్ని చుట్టిరావాలని కలలు కంది. ఆ కలను నిజం చేసుకునేలా..సుమారు ఆరు ఖండాలను సందర్శించింది. అయితే చివరి ఖండం వచ్చేటప్పటికీ వృద్ధరాలైపోవడంతో.. ఎలా? అని కలవరపడింది. అయితే "యస్ థియరీ" అనే యూట్యూబ​ ఛానెల్‌ క్రియేటర్స్‌ అమ్మర్‌ కందిల్‌, స్టాపన్‌ టేలర్‌ ఈ బామ్మ డ్రీమ్‌కు సాయం అందించారు. 

ఈ క్రియేటర్స్‌ కాలిఫోర్నియాలోని రెడ్‌వుడ్స్ రిటైర్‌మెంట్ విలేజ్‌లో ఒక కథను చిత్రీకరిస్తుండగా .. బామ్మ స్మిత్‌ని కలిశారు. ఆమె జీవిత అభిరుచుకి ఫిదా అయ్యి..ఆమెకు సాయం చేసేందుకు ముందుక వచ్చారు. ఆమె చూడాల్సిన చివరి ఖండమైన ఆస్ట్రేలియాను తన కూతరు అడ్రియన్‌తో కలిసి వెళ్లేలా జర్నీ ప్లాన్‌ చేశారు ఈ క్రియేటర్స్‌. ఆ బామ్మ జర్నీలో కందిల్‌, టేలర్‌ కూడా చేరారు. ఇక 102 ఏళ్ల బామ్మ క్వాంటాస్ విమానంలోని బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి ఆస్ట్రేలియా చేరుకుంది. 

అక్కడ చూడవల్సిన స్మిత్ సిడ్నీ హార్బర్ క్రూయిజ్‌, వైల్డ్ లైఫ్ సిడ్నీ జూ, ఒపేరా హౌస్, బోండి బీచ్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలన్నింటిని సందర్శించింది. తనకు ఈ సిడ్నీ పర్యటన అత్యంత మనోహరంగా ఉందని, అక్కడి ఆహారం, ప్రజల జీవనశైలి అత్యద్భుతంగా ఉన్నాయంటోంది స్మిత్‌. అంతేగాదు ఆస్ట్రేలియాలో టేకాఫ్‌కు ముందు పైలట్లు, సిబ్బంది ఆమెను సత్కరించడం విశేషం. అందుకు సంబంధించిన వీడియోని కూడా కందిల్, టేలర్‌ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడంతో నెట్టింట తెగ వైరల్‌గా మారింది. 

(చదవండి: ప్రపంచంలోనే చెత్త ఎయిర్‌లైన్స్‌.. ఇండిగో స్థానం ఇది!)

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)