Breaking News

జస్ట్‌ 10 నిమిషాలు అదొక్కటి చాలు! నాసా స్టడీ

Published on Wed, 06/04/2025 - 12:26

అందరూ ఆరోగ్యంపై ఫోకస్‌ పెట్టాలి అనుకుంటారు. కానీ మధ్యలోనే వదిలేసేవాళ్లు కొందరైతే, మరికొంతమంది మన వల్ల కాదు అని చేతులేత్తుస్తుంటారు. అస్సలు హెల్దీగా ఉండాలంటే..అది చాలా తేలిగ్గా తెలివిగా చేసే పని అంటోంది నాసా. అందరూ బిజీ షెడ్యూల్‌తో శారీర ఆరోగ్యంపై దృష్టి పెట్టడం కష్టంగా మారింది. పైగా వర్కౌట్లు కొన్ని రోజుల తర్వాత విపరీతమైన వొళ్లు నొప్పులుగా అనిపించి స్కిప్‌ చేసేస్తుంటారు. దాంతో చాలామంది కంటిన్యూ లేదా దైనందిన జీవితంలో ఆ వ్యాయామాలను భాగం చేసుకోలేక విఫలమవుతుంటారు. అలాంటివాళ్లు ఒక్క పదినిమిషాలు ఈ వ్యాయమానికి కేటాయించండి చాలు అని చెబుతోంది నాసా పరిశోధన. ఇది ఎంత ‍ప్రభావవంతమైన ప్రయోజనాలందిస్తుందో తెలిస్తే ఆశ్చర్యపోతారని అంటోంది. పైగా మధ్యలో వదిలేయరు, అది మీ జీవితంలో ఓ భాగమైపోతుందని నమ్మకంగా చెబుతోంది. మరీ ఆ వ్యాయామం ఏంటంటే..

ఎక్కువ పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలతో సతమతమయ్యే వారికి ఈ వ్యాయామం చాలా బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది నాసా. ఇది ఒక చిన్న ట్రాంపోలిన్‌పై చేసే జంపింగ్‌ లాంటి వ్యాయామం. పిల్లలు అమిత ఇష్టంగా చేసే జంపింగ్‌ క్రీడ. 

ఇది గనుక చేస్తుంటే తెలియకుండానే ఒక విధమైన ఆనందం..పైగా అమితోత్సాహంతో మరింతగా చేస్తారట కూడా. ఇది తెలియకుండానే బాడీలోని కేలరీలను తగ్గిస్తుందట. ఇందుకోసం కావాల్సిందల్లా..మినీ-ట్రాంపోలిన్ ఉంటే చాలు. దీంతో జంపింగ్‌ జాక్‌లు చేస్తుంటే..బరువు అదుపులో ఉండటమేగాక..బాడీ కూడా ఫిట్‌గా ఉంటుందని చెబుతున్నారు. పోనీ ఈ జంపింగ్‌ కుదరకపోతే..ఓ 30 నిమిషాలు మీకు నచ్చిన మ్యూజిక్‌తో నచ్చినట్లుగా గంతులు వేయండి. 

ఓ పద్ధతి అవసరం లేదు బాడీ అంతా ఊగేలా ఎంజాయ​ చేస్తూ నచ్చినట్లుగా డ్యాన్స్‌ చేయండి. దాన్ని ఒక అలవాటుగా చేసుకోండి చాలు అని చెబుతోంది నాసా. ఇది పరుగు, జాగింగ్‌ కంటే కూడా అత్యంత ప్రభావవంతంగా ఉంటుందట. కచ్చితంగా మెరుగైన ఫలితాలు పొందగలరని చెబుతోంది నాసా పరిశోధన. ఇది శరీరంపై అధిక ఒత్తడిని కలిగించదు. అదీగాక ఎవ్వరైనా హాయిగా సులభంగా చేయగలిగేవే ఈ వ్యాయమాలని పేర్కొంది నాసా. 

ఆరోగ్య లాభాలు..

  • సరదాగా ఉండే ఈ వ్యాయమాం కిల్లర్‌ ఫుల్‌ బాడీ వ్యాయామం

  • కీళ్లపై సున్నితంగా ఉంటుంది. అయితే మోకాళ్లు, చీలమండలంపై కఠినంగా ఉంటుంది. 

  • శోషరస వ్యవస్థ మెరుగ్గా ఉండేలా చేస్తుంది. 

  • పైగా ఇది మంచి కార్డియో వర్కౌట్ల పనిచేస్తుంది. 

  • ఆరోగ్యానికి బెస్ట్‌ వ్యాయామం కూడా.

గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రేమే ఇచ్చాం. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత వైద్యులను లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం.

(చదవండి: ఆ విషయాలు గురించి అస్సలు మాట్లాడను! హాట్‌టాపిక్‌గా హర్ష్‌గోయెంకా ప్రసంగం)

 

#

Tags : 1

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

'ఆదర్శ కుటుంబం'లోని నారాయణమ్మ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)