Breaking News

సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు ఎలా చూడొచ్చంటే?

Published on Tue, 05/06/2025 - 10:58

ఢిల్లీ: సుప్రీంకోర్టు (supreme court) కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాల్ని పబ్లిక్‌ డొమైన్‌లో అందుబాటులోకి తెచ్చింది.

ఏప్రిల్‌ 1వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తులంతా కలిసి ఫుల్‌ కోర్టు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తులందరూ వారి ఆస్తుల వివరాల్ని బహిర్గతం చేసేందుకు అంగీకరించారు. ఈ మేరకు అత్యున్నత న్యాయ స్థానానికి చెందిన 33 మంది జడ్జీలలో 21మంది జడ్జీల ఆస్తుల వివరాలను సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

ఈ ఆస్తుల్లో రియల్‌ ఎస్టేట్‌,మూవబూల్‌ ప్రాపర్టీలు ,గోల్డ్‌,పెట్టుబడుల వివరాలు ఉన్నాయి. జడ్జీలతో పాటు వారి సతీమణులకు చెందిన ఆస్తులతో పాటు, ఉమ్మడి కుటుంబమైతే వారి ఆస్తుల వివరాల్ని సైతం ఉన్నాయి. ఆస్తుల వివరాల్ని జడ్జీలతో పాటు ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు కొలీజియం సైతం వారి ఆస్తుల వివరాల్ని అందిస్తున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.

నవంబర్ 2022 మే 2025 మధ్య జరిగిన నియామకాల గురించి ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం, పారదర్శకతను పెంచేందుకు అత్యున్నత న్యాయస్థానం ఈ వివరాల్ని తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది. ఆస్తుల వివరాలే కాదు సుప్రీంకోర్టు, హైకోర్టులలో నియామకాలు, హైకోర్టు కొలీజియంకు కేటాయించిన పాత్రలతో సహా, రాష్ట్ర ప్రభుత్వాలు హైకోర్టు జడ్జీల నియామకపు ప్రతిపాదనలు వంటి ఇతర వివరాలు సైతం అందుబాటులోకి వచ్చాయి. 

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్‌ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు
కాగా,ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా (Delhi HC Judge) యశ్వంత్‌వర్మ అధికారిక నివాసంలో భారీఎత్తున కాలిన నోట్ల కట్టలు బయటపడడం సంచలనంగా మారింది. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఇది వివాదాస్పదం కావడంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

సుప్రీంకోర్టు జడ్జీల ఆస్తుల వివరాలు.. ఎలా చూడొచ్చంటే?


గూగుల్‌లో సుప్రీంకోర్టు ఆఫ్‌ ఇండియా అని టైప్‌ చేయండి. అనంతరం మీకు సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌ సైట్‌ లింక్‌ కనిపిస్తుంది. ఆ లింక్‌ క్లిక్‌ చేస్తే సుప్రీంకోర్టు అధికారిక వెబ్‌సైట్‌ ఇంటర్‌ ఫేస్‌ కనిపిస్తుంది. ఇంటర్‌ ఫేస్‌ టాప్‌ బార్‌లో మీకు హోం,అబౌట్‌ అజ్‌,జడ్జస్‌ ఇలా కేటగిరీలు కనిపిస్తాయి. వాటిల్లో జడ్జస్‌ కేటగిరి మీద ట్యాప్‌ చేస్తే అసెట్స్‌ ఆఫ్‌ జడ్జస్‌ అనే సబ్‌ కేటగిరీలు కనిపిస్తాయి. ఆ ఆప్షన్‌ మీద క్లిక్‌ చేస్తే సుప్రీంకోర్టు జడ్జీల పేర్లు పక్కన వ్యూ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని మీద క్లిక్‌ చేస్తే ఆస్తుల వివరాలు ఓపెన్‌ అవుతాయి.  

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)