Breaking News

గూగుల్‌తో హెచ్‌పీ జట్టు!

Published on Fri, 09/29/2023 - 01:38

న్యూఢిల్లీ: భారత్‌లోనే క్రోమ్‌బుక్స్‌ను ఉత్పత్తి చేసే దిశగా టెక్‌ దిగ్గజం గూగుల్‌తో కంప్యూటర్ల తయారీ సంస్థ హెచ్‌పీ చేతులు కలిపింది. అక్టోబర్‌ 2 నుంచి వీటిని చెన్నైకి దగ్గర్లోని తమ ఫ్లెక్స్‌ ఫెసిలిటీలో వీటి ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు హెచ్‌పీ ఇండియా సీనియర్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ బేడి తెలిపారు. 2020 ఆగస్టు నుంచి హెచ్‌పీ ఈ ప్లాంటులోనే ల్యాప్‌టాప్‌లు, డెస్క్‌టాప్‌ల శ్రేణిని ఉత్పత్తి చేస్తోంది. (ఎస్‌బీఐ గుడ్‌న్యూస్‌, హోంలోన్‌ ఆఫ్‌ర్‌ పొడిగింపు, ఇక కార్‌ లోన్లపై..!)

భారత్‌లో విద్యారంగం డిజిటల్‌ పరివర్తనకు తమ వంతు తోడ్పాటు అందించే క్రమంలో ఇదొక కీలక మైలురాయి కాగలదని గూగుల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం హెడ్‌ (దక్షిణాసియా) బాణీ ధవన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం గూగుల్‌ క్రోమ్‌ ఆపరేటింగ్‌ సిస్టంతో లభించే క్రోమ్‌బుక్స్‌ను ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది పైచిలుకు విద్యార్థులు, టీచర్లు వినియోగిస్తున్నారు. కేజీ నుంచి పన్నెండో తరగతి వరకు విద్యాభ్యాసానికి ఉపయోగిస్తున్న డివైజ్‌లలో ఇవి అగ్రస్థానంలో ఉన్నాయి. నోట్‌బుక్స్‌తో పోలిస్తే క్రోమ్‌బుక్స్‌ ధరలు కొంత తక్కువగా ఉంటాయి. భారత్‌లో ఐటీ హార్డ్‌వేర్‌ తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ. 17,000 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం కోసం దరఖాస్తు చేసుకున్న సంస్థల్లో హెచ్‌పీ కూడా ఉంది.

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)