Breaking News

Hyderabad: అర్ధరాత్రి యువకుడి కిడ్నాప్‌

Published on Sat, 09/03/2022 - 09:44

నాగోలు: కారు, ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండుగులు  ఓ యువకుడిని అర్ధరాత్రి కిడ్నాప్‌  చేసిన సంఘటన సరూర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం ఆర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. గడ్డిఅన్నారం డివిజన్‌ పిఅండ్‌టి కాలనీకి చెందిన లంక సుబ్రహ్మణ్యం (24)  గురువారం అర్ధరాత్రి శ్రవణ్, దినేష్‌ స్నేహితులతో మాట్లాడుతుండగా ముగ్గురు  గుర్తుతెలియని వ్యక్తులు వచ్చారు. వారు సుబ్రహ్మణ్యం తండ్రి గురించి వాకబు చేశారు. తన తండ్రి నిద్రపోతున్నాడని చెప్పాడు. చౌరస్తా వద్దకు రావాలని చెప్పడంతో శ్రవణ్, దినేశ్‌లు అక్కడికి వెళ్లారు.


ఇంతలో కారులో వచ్చిన గుర్తుతెలియని వ్యక్తులు సుబ్రహ్మణ్యంను కారులో ఎక్కించుకొని  వెళ్లిపోయారు. ఈ విషయమై సుబ్రమణ్యం తండ్రి లంక లక్ష్మీనారాయణ సరూర్‌నగర్‌ పోలీసులకు   ఫిర్యాదు చేశాడు. లక్ష్మీనారాయణ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అతని ఇంటి వద్ద ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించారు.  ఇదిలా ఉండగా కిడ్నాప్‌ గురైన సుబ్రహ్మణ్యం నల్గొండ జిల్లా చింతపల్లిలో ఉన్నారనే సమాచారం మేరకు ఎస్‌ఓటి పోలీసులు అక్కడికి వెళ్లి సుబ్రహ్మణ్యం తో పాటు కిడ్నాప్‌ చేసిన వారిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఎస్‌ఓటి పోలీసుల అదుపులో ఉన్న వివరాలను సరూర్‌ నగర్‌ పోలీసులు వెల్లడించడం లేదు. కిడ్నాప్‌కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
చదవండి: వయసులో తండ్రీ కొడుకులకు ఏడేళ్లే తేడా!

Videos

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

Photos

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)