Breaking News

హైటెక్‌ సిటీ: ప్రాణం తీసిన అతివేగం.. యువతి మృతి

Published on Fri, 08/18/2023 - 09:13

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని మాదాపూర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. అతి వేగం ఓ యువతి ప్రాణాలను బలితీసుకుంది. నిండు ప్రాణం గాలిలో కలిసింది. హైటెక్‌ సిటీ ఫ్లైఓవర్‌పై హైస్పీడ్‌లో వెళ్తున్న స్కూటీ సైడ్‌వాల్‌ను ఢీకొనడంతో వాహనం వెనుక కూర్చున్న యువతి ఫ్లైఓవర్‌పై నుంచి పడిపోయి మృతిచెందింది. 

వివరాల ప్రకారం.. మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని లోయర్‌ ట్యాంక్‌బండ్‌లో నివాసం ఉంటున్న స్వీటీ పాండే(22) ఓ ప్రైవేట్‌ ఉద్యోగి. గురువారం సాయంత్రం వెస్ట్‌ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన స్నేహితుడు రాయన్‌ ల్యూకెతో కలిసి స్కూటీపై జేఎన్టీటీయూ కూకట్‌పల్లి నుంచి బయలుదేరింది. యువకుడు ఐకియా వైపు వెళ్తూ వాహనాన్ని వేగంగా నడిపాడు. హైటెక్‌ సిటీ చౌరస్తా వద్ద ఉన్న ఫ్లైఓవర్‌ వద్దకు రాగానే వాహనం అదుపు తప్పి ప్రొటెక్షన్‌ వాల్‌ను ఢీకొన్నది. ఈ క్రమంలో బైక్‌పై వెనుక కూర్చున్న స్వీటీ పాండే ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఫ్లైఓవర్‌ పైనుంచి రోడ్డుపై పడి తీవ్రంగా గాయపడింది.

ఈ ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న రాయన్‌ ల్యూకే కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో, వారిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో స్వీటీ పాండే తలకు తీవ్ర గాయం కావడంతో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా తరలించినట్టు స్పష్టం చేశారు. 

ఇది కూడా చదవండి: ప్రమాదవశాత్తు కిందపడి గర్భిణి మృతి


 

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు