Breaking News

ఆసరా అవుతాడనుకుంటే ఆగం చేసిండు!

Published on Mon, 12/02/2024 - 12:15

లింగాలఘణపురం: చేతికందిన కొడుకు ఆసరా అవుతాడని అనుకుంటే ఆగం చేసిండంటూ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. మండల కేంద్రానికి చెందిన గండి అంజయ్య, రేణుక దంపతుల కుమారుడు కల్యాణ్‌ (22) గత నెలలో యాదాద్రి భువనగిరి జిల్లా వంగపల్లి వద్ద జరిగిన  రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ శనివారం రాత్రి మృతి చెందాడు. 

మండల కేంద్రానికి చెందిన తన స్నేహితుడు దేవరాయ కరుణాకర్‌తో కలిసి గత నెల 25న భువనగిరి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో వంగపల్లి సమీపంలో బైక్‌ అదుపు తప్పి కింద పడ్డారు. ఈ ప్రమాదంలో కల్యాణ్‌కు తీవ్ర, కరుణాకర్‌కు స్వల్ప గాయాలు కాగా పోలీసులు హై దరాబాద్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. కల్యాణ్‌ కోమాలోకి వెళ్లాడు. ఐదు రోజులు చికిత్స పొందినా ఫలితం లేదు. శనివారం రాత్రి మృతి చెందాడు.  

ఫ్యాషన్‌ షోలపై మక్కువ
కల్యాణ్‌కు ఫ్యాషన్‌ షోలపై మక్కువ. 2023లో సడఫ్‌ ప్యాషన్‌ షో అడిషన్స్‌లో పాల్గొన్నారు. ఈ క్రమంలో కల్యాణ్‌ భువనగిరికి ఎందుకు వెళ్లాడో ఏమో తెలియదు. ప్రమాదంలో గాయపడ్డాడని సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఆసుపత్రిలో కోమాలో ఉన్న కొడుకును చూసి తల్లడిల్లారు. ఏదైనా పని చేసి తమకు అండగా ఉంటాడని భావించిన తల్లిదండ్రుల ఆశలు నిరాశలయ్యాయి. తాము ఇష్టంగా కొనిచి్చన బైక్‌తో ప్రమాదం జరిగి మృతి చెందడంతో ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు.  

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)