Breaking News

ప్రేమలో విఫలమై కాశ్మీరీ యువతి ఆత్మహత్య..!

Published on Tue, 11/12/2024 - 10:27

ఫిలింనగర్‌: జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్‌ సరిహద్దులోని బారాముల్లా ప్రాంతానికి చెందిన ఓ యువతి ఉద్యోగ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి ప్రేమలో విఫలమై ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... బారాముల్లా మాలాపొరా ప్రాంతానికి చెందిన ఇరం నబీడార్‌ (23) షేక్‌పేట గుల్షన్‌కాలనీలో ఓ పెంట్‌హౌస్‌లో అద్దెకు ఉంటూ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా గత జనవరి నుంచి పనిచేస్తున్నది. 

ఈ నెల 8వ తేదీన ఉదయం ఆమె స్నేహితుడు అబ్దుల్‌ ఆమెకు ఫోన్‌ చేయగా ఆమె ఫోన్‌ లిఫ్ట్‌ చేయలేదు. కొద్దిసేపటికే ఆమె తల్లి కూడా అబ్దుల్‌కు ఫోన్‌ చేసి తన కూతురు ఫోన్‌ లిఫ్ట్‌ చేయడం లేదని, ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రావాలని తెలిపింది. ఆందోళన చెందిన అబ్దుల్‌ సాయంత్రం 5.30 గంటలకు ఇరం ఉంటున్న గదికి వెళ్లి తలుపు తట్టగా ఎంతకూ తెరవలేదు. దీంతో పక్కనే ఉన్న వాచ్‌మెన్‌ను పిలిచి తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే అంబులెన్స్‌ సహాయంతో ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. 

అబ్దుల్‌ ఇచి్చన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అంతకముందు రోజు అర్ధరాత్రి 2 గంటల వరకు కశ్మీర్‌లోని బారాముల్లాలో ఉండే తన ప్రియుడితో మాట్లాడినట్లుగా నిర్థారించారు. ప్రేమ విఫలం కావడం వల్లనే ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా మృతదేహాన్ని విమానంలో కశీ్మర్‌కు తరలించారు. ఫిలింనగర్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)