Breaking News

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Published on Sun, 12/01/2024 - 10:25

గజపతినగరం : వివాహేతర సంబంధం ఇద్దరిని ఆత్మహత్యకు పురిగొల్పింది. ఇందులో ప్రియుడు ప్రాణం కొల్పోగా... ప్రియురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. గజపతినగరం మండలం మరుపల్లి గ్రామానికి చెందిన శీర పైడిరాజు(31)కు కొత్తవలస మండలానికి చెందిన బొబ్బిలి ఆదిలక్ష్మితో మూడేళ్ల కిందట వివాహమైంది. 

వీరి దాంపత్య జీవితంలో సంతానం కలగలేదు. ఈ నేపథ్యంలో అదే గ్రామానికి చెందిన వివాహిత సబుకు రామలక్ష్మితో పైడిరాజుకు ఎనిమిది నెలల కిందట పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. పైడిరాజు పురిటిపెంట సమీపంలో ఆటోను నడుపుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం పురిటిపెంట రైల్వే గేటు వద్ద వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఏం జరిగిందో తెలియదుగాని ఇద్దరి మధ్య మాటమాట పెరిగి పురుగుల మందు సేవించి అక్కడి పడిపోయారు. 

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరినీ విజయనగరం మహారాజ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించి పైడిరాజు శనివారం మృతి చెందినట్టు తెలిపారు. రామలక్ష్మి వైద్య సేవలు పొందుతున్నట్టు చెప్పారు. మృతుడి తండ్రి శీర అప్పలనాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ కె.లక్ష్మణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రామలక్ష్మికి కూడా ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)