Breaking News

న్యాయం కోసం చంద్రబాబు దగ్గరికి వస్తే..

Published on Tue, 11/19/2024 - 03:37

తిరుపతి రూరల్‌: అయ్యా.. నా పరిశ్రమను నాశనం చేశారని, నాపై దౌర్జన్యం చేసి జాకెట్‌ను సైతం చించేశారు, పోలీసులు కూడా నాపై దాడిచేసిన వారికే వత్తాసు పలుకుతున్నారు, ముఖ్యమంత్రిగారికి నా బాధ చెప్పుకుంటానయ్యా.. అంటూ వచ్చింది ఓ మహిళ. అయితే ఆయన వ్యక్తిగత పర్యటన మీద వచ్చారని, ఎవరినీ కలవరంటూ  ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లిలో జరిగిందీ ఘటన. 

.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన యశోద కుటుంబంతో కలిసి తిరుపతి రూరల్‌ మండలం గాంధీపురం పంచాయతీ పరి­ధిలో రాజేశ్వరరావు, సరోజినిదేవి దంపతుల నుంచి కొంతభూమి అద్దెకు తీసుకున్నారు. దాదాపు రూ.కోటి ఖర్చుతో ఎల్‌వీ పవర్‌లూమ్స్, హ్యాండ్‌లూమ్స్‌ పరిశ్రమను ఏర్పాటు చేశారు. హాథీరాంజీ మఠానికి చెందిన ఈ భూమి వివాదంలో ఉంది. ఈ భూమికి తామే యాజమానులమని, అద్దె తమకే చెల్లించాలని పలువురు బెదిరిస్తుండటంతో ఆమె కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. 

కోర్టు స్టే ఉన్నా రాజేశ్వరరావు, మరికొందరు కలిసి హ్యాండ్‌లూమ్స్‌ను ఖాళీచేయాలని దౌర్జన్యం చేస్తున్నారు. రూ.50 లక్షల విలువైన యంత్రాలను నాశనం చేశారు. కోర్టు స్టే ఉన్నా సామగ్రి ఎత్తుకెళ్లి ఆమెపై దాడిచేశారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేందుకు వచి్చన తనను తిరుపతి జిల్లా పోలీసులు అడ్డుకోవడమే కాకుండా దురుసుగా ప్రవర్తించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

సోమవారం యశోద.. నారావారిపల్లికి వచ్చి సీఎం చంద్రబాబును కలవడానికి ప్రయత్నించింది. అయితే పోలీసులు అడ్డుకోవడంతో ఏడుస్తూ.. ఆమె రోడ్డుపై బైఠాయించారు. సీఎం తనకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. చేతి గాజులు పగులుగొట్టుకుని వాటిని మింగేందుకు ప్రయత్నించారు. ఆమెను ఆపి బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.

మీడియాపైనా దౌర్జన్యం..
ఈ ఘటనను ఫొటోలు, వీడియోలు తీస్తున్న మీడియా ప్రతినిధులపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్‌ఫోన్లు, కెమెరాలను లాక్కుని ఫొటోలు, వీడియోలను డిలీట్‌ చేశారు. దీనిపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నారావారిపల్లెలో సీఎం ముందు మహిళ ఆత్మహత్యాయత్నం

Videos

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)