Breaking News

కాస్ట్‌లీ ఫోన్‌ కోసం పసికందును అమ్మేసి..

Published on Fri, 07/28/2023 - 10:55

క్రైమ్‌: కన్నవాళ్లే బిడ్డల పట్ల అమానుషంగా.. కర్కశంగా వ్యవహరిస్తున్న ఘటనలూ చూస్తున్నాం. తాజాగా అలాంటి ఘటనే ఒకటి పశ్చిమ బెంగాల్‌లో వెలుగు చూసింది. ఎనిమిది నెలల పసికందును అమ్మేసి.. ఆ డబ్బుతో జల్సాలకు దిగింది ఓ జంట. పైగా ఇందులో తల్లి పాపం ఎక్కువగా ఉండడం గమనార్హం.

పశ్చిమ బెంగాల్‌ ఉత్తర 24 పరగణాల జిల్లాలో ఈ ఘటన జరిగింది. జయదేవ్‌ ఘోష్‌, సతీ ఇద్దరూ భార్యభర్తలు. భర్త చిరుద్యోగి కావడంతో తన సరదాలు నెరవేరడం లేదని తీవ్ర అసంతృప్తిలో ఉంటూ వస్తోంది సతీ. ఈ క్రమంలో భర్తను ఒప్పించి.. తమ ఎనిమిది నెలల బిడ్డను డబ్బు కోసం అమ్మేశారు. ఆ డబ్బుతో కాస్ట్‌లీ ఫోన్లు కొనుక్కోవడంతో పాటు దేశంలోని కొన్ని ప్రాంతాలు తిరిగొచ్చారు. 

అయితే బిడ్డ కనిపించకపోవడం, పైగా నెల తర్వాత ఆ జంట తిరిగి ఇంటికి  రావడంతో స్థానికులకు అనుమానం కలిగింది. చుట్టుపక్కలవాళ్లు నిలదీయడంతో వాళ్లు తడబడగా.. పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు వాళ్లు నిలదీయడంతో రూ.2 లక్షలకు బిడ్డను అమ్మేసినట్లు ఆ తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పైగా సతీ ఓ అడుగుముందుకు వేసి.. బిడ్డను అమ్మేసిన తర్వాత  తన స్నేహితులను ఇంటికి రప్పించుకుని గంజాయి మత్తులో మునిగి తేలిందని పోలీసులు గుర్తించారు.

జయదేవ్‌-సతీతో పాటు బిడ్డను కొనుగోలు చేసిన ప్రియాంక ఘోష్‌ అనే మహిళను సైతం పోలీసులు అరెస్ట్‌ చేశారు. చంటి బిడ్డను శిశుసంక్షేమ గృహానికి తరలించారు అధికారులు. ఈ దంపతులకు మరో కూతురు కూడా ఉండడంతో.. ఆమెను మాత్రం బంధువులను అప్పగించారు.

ఇదీ చదవండి: రాధను హత్య టైంలో సీసీ కెమెరాలు ఆఫ్‌?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)