Breaking News

అదే పనిగా భర్తకు నైట్‌ షిఫ్ట్‌.. కోపంతో భార్య.. రాత్రి మాస్క్‌ వేసుకుని ఇంట్లోకి దూరి

Published on Fri, 07/21/2023 - 15:31

సాధారణంగా కార్పొరేట్ కంపెనీల్లో నైట్ షిఫ్టులు అనేది సర్వసాధారణం. ముఖ్యంగా అమెరికా, యూకే ఆధారిత కంపెనీల్లో పని చేస్తుంటే నైట్‌ షిఫ్ట్‌లు చేయక తప్పదు. ఉద్యోగం కోసం కొందరు తప్పక నైట్‌ షిఫ్ట్‌లకు అంగీకరించినా.. వారి జీవన విధానం పూర్తి భిన్నంగా ఉంటుంది. రాత్రిళ్లు మేల్కొని పనిచేయాల్సి ఉంటుంది. మెలకువగా ఉండేందుకు నానా తంటాలు పడుతుంటారు. అయినా ఎలాగోఒకలా డ్యూటీ చేసినా.. ఆ తర్వాత ఆరోగ్య సమస్యల రావడం కామన్‌.

అదే పనిగా నైట్‌ షిఫ్ట్‌...
అందుకే రాత్రిపూట పని చేయడానికి చాలా వరకు ఇష్టపడరు. కానీ... కొన్ని చోట్ల కార్పొరేట్ కంపెనీల్లో బాస్‌లు ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ బలవంతంగా నైట్‌ షిఫ్ట్‌లు చేయిస్తుంటారు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ఉదంసింగ్ నగర్ జిల్లాలో ఈ తరహా కేసు వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే..టేకి రవ్లీన్‌, రవ్లీన్ కౌర్ ఇద్దరూ దంపతులు. వీరు ఉధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని ట్రాన్సిట్ క్యాంపు ప్రాంతంలోని హౌసింగ్ డెవలప్‌మెంట్‌లో రౌలీన్ నివసిస్తున్నారు. టెకీ రవ్లీన్‌ పంత్‌నగర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.

పగ పెంచుకుంది
అదే కంపెనీలో పనిచేస్తున్న రవ్లీన్ హెడ్ దీపక్ భాటియా చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. వారి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ ఇటీవల రవ్లీన్‌కు అదే పనిగా నైట్‌ షిఫ్ట్‌ వేయిస్తున్నాడు. అంతే కాకుండా జీతం కూడా పెంచలేదు. రోజూ భర్త రాత్రికి వెళ్లి నైట్ షిఫ్ట్ చేసి తెల్లవారుజామున తిరిగి వచ్చేవాడు, దీంతో క్రమంగా అతని ఆరోగ్యం కూడా క్షీణించింది.  ఈ క్రమంలో తన భర్త యజమానిపై రవ్లీన్‌ కౌర్‌ పగ పెంచుకుంది. అతనికి తగిన బుద్ధి చెప్పాలనుకుని అందుకోసం ఓ ప్లాన్ వేసింది.. ఓ రోజు రాత్రి మాస్క్‌ ధరించి భర్త బాస్‌ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న యజమాని తల్లిపై దాడి చేసి.. ఆమె తలపై సుత్తితో బాదింది.

ఆమె గట్టిగా అరిచింది. ఈ క్రమంలో.. అరుపులు విని ఆమె మనవడు గదిలోకి వచ్చాడు. దీంతో ఆ మహిళ భయపడి అక్కడి నుంచి పారిపోయింది. గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలించారు. ఆపై.. సీసీటీవీల ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేం రివెంజ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

చదవండి   Aunty Network: హోరు వానలో..  కూర్చుని ముచ్చట్లు పెట్టిన ఆంటీలు.. 

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)