Breaking News

విడాకులు కావాలన్న భార్య.. కుటుంబం మొత్తాన్ని కాల్చి చంపిన భర్త..

Published on Fri, 01/06/2023 - 18:21

అమెరికా యుటాలో దారుణం జరిగింది. విడాకులు కావాలని భార్య కోర్టులో దరఖాస్తు చేసిన కొద్ది రోజులకే భర్త కిరాతక చర్యకు పాల్పడ్డాడు. కుటుంబంలోని మొత్తం ఏడుగురిని తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం తానూ అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది.

ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిని మైకేల్ హైట్‌గా గుర్తించారు. హత్యకు గురైన ఏడుగురిలో అతని భార్య, ఐదుగురు పిల్లలతో పాటు అత్త కూడా ఉన్నారు. పిల్లలంతా 4-17ఏళ్ల వారే కావడం గమనార్హం. మరణించిన ఐదుగురు చిన్నారుల్లో 4, 7 ఏళ్ల అబ్బాయిలు, 7,12,17 ఏళ్ల అమ్మాయిలు ఉన్నారు. 

అయితే మైకేల్‌కు తన భార్యతో రెండేళ్లుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే భార్య అతనిపై ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే క్రిస్మస్‌కు ముందు డిసెంబర్ 21న తన భర్త నుంచి విడాకులు కావాలని ఆమె కోర్టులో పిటిషన్ వేసింది. ఆ తర్వాత కొద్దిరోజులకే భర్త దారుణానికి ఒడిగట్టాడు. కుటుంబంలో ఎవ్వరినీ వదలకుండా అందరినీ హతమార్చి, తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు.
చదవండి: రెస్టారెంట్‌లో కాల్పుల కలకలం.. ర్యాపర్ సహా 10 మందికి గాయాలు

Videos

Khammam : కాలువలో స్కూల్ బస్సు బోల్తా

Nizamabad : అంగవైకల్యం అడ్డస్తున్నా.. సంకల్ప బలం ఉంటే చాలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు

ఉల్లి పంటకు గిట్టుబాటు ధర దొరక్క తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన రైతులు

Anakapalli: రోడ్లు వేయాలంటూ పంచకర్ల రమేష్‌ను పట్టుబట్టిన స్థానికులు

Kannababu: చంద్రబాబు మాటలు కోటలు దాటుతాయి.. చేతలు ఇళ్లు దాటవు

జోగి రమేష్ భార్య, కుమారులకు నోటీసులు ఇచ్చిన పోలీసులు

Price Hikes: కొండెక్కిన చికెన్ ధర

Kakinada: YSRCP కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జ్

బ్యానర్ల ముసుగులో తనపై హత్యాయత్నం చేశారన్న గాలి జనార్దన్ రెడ్డి

Photos

+5

2025కి వీడ్కోలు.. పీవీ సింధు క్యూట్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

నిర్మాత దిల్ రాజు ఫ్యామిలీ దుబాయి ట్రిప్ (ఫొటోలు)

+5

కొడుకుతో ట్రిప్ వేసిన వరుణ్ తేజ్-లావణ్య (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : ఈ గుహలో ఉన్న లక్ష్మీ నరసింహ ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

కొత్త ఏడాది జోష్‌..జనసంద్రమైన విశాఖ బీచ్ (ఫొటోలు)

+5

ప్రభాస్ ‘ది రాజా సాబ్’HD మూవీ స్టిల్స్‌

+5

కొత్త ఏడాది వేడుకలు.. తన ఉద్యోగులతో జరుపుకున్న అల్లు అర్జున్‌ (ఫోటోలు)

+5

న్యూ ఇయర్‌ ఎఫెక్ట్‌: బిర్లా మందిర్‌కు పోటెత్తిన భక్లులు (ఫోటోలు)

+5

కొత్త ఏడాది సెలబ్రేషన్స్‌లో మహేష్‌ బాబు ఫ్యామిలీ (ఫోటోలు)

+5

బీచ్‌లో భర్తతో కలిసి అనసూయ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్ (ఫొటోలు)