కృష్ణా: ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసు కొట్టివేత

Published on Fri, 07/14/2023 - 12:03

సాక్షి, కృష్ణా జిల్లా: సంచలనం సృష్టించిన ఉంగుటూరు ట్రిపుల్ మర్డర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆధారాలు లేవంటూ ఈ కేసును ఏడీజే(జిల్లా అదనపు జడ్జి) కోర్టు కొట్టివేసింది. అక్టోబర్ 24, 2014న కృష్ణాజిల్లా ఉంగుటూరు మండలం పెదఅవుటుపల్లి సమీపంలో అయిదో నెంబరు జాతీయ రహదారిపై జరిగిన కాల్పుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పినకడిమికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని ఇద్దరు కుమారులు పగిడి మారయ్య, గుంజుడు మారయ్యలు దారుణ హత్యకు గురయ్యారు.

రెండు కుటుంబాల మధ్య విభేదాలు తలెత్తడంతో హత్య కోసం ఢిల్లీ నుంచి కాంట్రాక్టు కిల్లర్లను మాట్లాడారు. ఈ కేసులో ఢిల్లీకి చెందిన ఏడుగురు కిరాయి హంతకులను ఢిల్లీలోనే అరెస్ట్  చేసి తీసుకువచ్చారు. ముంబై నుంచి గన్నవరం విమానాశ్రయానికి గంధం మారయ్య, పగిడి మారయ్యలు వచ్చారు. వారిని తీసుకెళ్లేందుకు ఏలూరు నుంచి వారి తండ్రి గంధం నాగేశ్వరరావు వచ్చారు.

అంతకుముందే విమానాశ్రయం వద్ద బాలాజీ, మహేష్‌, శివలు ఎరుపురంగు కారులో క్యాప్‌లు ధరించి ఉన్నారు. వీరితో పాటు పల్సర్‌ బైక్‌పై హంతకముఠా సభ్యుడు(షూటర్స్‌బ్యాచ్‌ )కూడా అక్కడే ఉన్నట్టు పోలీసులు కేసు రిపోర్టులో పేర్కొన్నారు.
చదవండి: ప్రియునితో జీవిస్తోందని భర్త కిరాతకం?

విమానం దిగి బయటకు వచ్చి తవేరా కారు ఎక్కగానే ఆ ముగ్గురూ చంపాల్సిన వ్యక్తులని షూటర్‌కు చూపించారు. దీంతో అతను షూటర్స్‌కు సమాచారం అందించాడు. తవేరా కారును ఆ షూటర్స్‌ మరో కారులో వెంబడించి గంధం నాగేశ్వరరావు, మారయ్య, పగిడి మారయ్యలను హతమార్చారు. శివ, మహేష్‌, బాలాజీలు ఘటన అనంతరం గుంటూరు వెళ్లి కారును వదిలి బస్సులో చెన్నై వెళ్లారు.

Videos

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)