Breaking News

Hyd: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

Published on Tue, 01/14/2025 - 17:56

హైదరాబాద్‌:  నగరంలోని పుప్పాలగూడలో జంట హత్యలు కలకలం రేపాయి. యువతీ, యువకుడ్ని కత్తులతో పొడిచి హత్య చేసినట్లు తెలుస్తోంది. పుప్పాలగూడలోని అనంత పద్మనాభస్వామి ఆలయ గుట్టల వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది,. ఈరోజు(మంగళవారం) ఉదయం గుట్టల వద్దకు వచ్చిన వారికి మృతదేహాలు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు..  మృతదేహాలను పరిశీలించారు.  మృతులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. అక్కడ బిల్డింగ్‌ నిర్మాణాలు జరుగుతుండటంతో పని చేయడానికి వేరే రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో కొన్ని ఆధారాలు సేకరించామని, వాటి ద్వారా మృతుల వివరాలను గుర్తిస్తామన్నారు.

ఘటన జరిగిన ప్రదేశాన్ని డీసీపీ శ్రీనివాస్‌ పరిశీలించారు. సీసీ ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామన్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)