Breaking News

జమ్మూ కశ్మీర్‌లో ఇద్దరు ఏపీ విద్యార్థుల దుర్మరణం

Published on Sat, 11/02/2024 - 04:16

పత్తికొండ (తుగ్గలి)/గిద్దలూరు రూరల్‌: జమ్మూ కశ్మీర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏపీకి  చెందిన ఇద్దరు బీటెక్‌ విద్యార్థులు దుర్మరణం చెందారు. కారు అదుపు తప్పి లోయలో పడిన ఘటనలో మొత్తం నలుగురు మృతి చెందగా వారిలో  వీరిద్దరూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. కర్నూలు జిల్లా  పత్తికొండలో  స్థిర నివాసమేర్పరచుకున్న తుగ్గలి మండలం పెండేకల్లుకు చెందిన పాటిల్‌ ప్రతాపరెడ్డి, అనిత దంపతుల పెద్ద కుమారుడు వెంకట ఆనందరెడ్డి (21),  ప్రకాశం జిల్లా  గిద్ద­లూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చెందిన  ఆర్మీ జవాన్‌ రమణారెడ్డి కుమార్తె కావ్యారెడ్డి (19) ప్రమాదంలో మృత్యువాత పడ్డారు.  

పంజాబ్‌లోని లవ్‌లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీలో వీరు బీటెక్‌ చదువుతున్నారు. అయితే కావ్యారెడ్డి చెల్లెలు మనీషా (19) కూడా అదే కాలేజీలో బీటెక్‌ ఫస్టియర్‌ చదువుతోంది. దీపావళికి వరుస సెలవులు రావడంతో గత నెల 28వ తేదీన జమ్మూ కశ్మీర్‌కు 30 మంది స్నేహితులతో కలిసి ఆరు కార్లలో విహారయాత్రకు వెళ్లారు. 30వ తేదీ తిరుగు ప్రయాణంలో శ్రీనగర్‌–జమ్మూ నేషనల్‌ హైవేలో రామబన్‌ జిల్లా మగర్‌కూట్‌ వద్ద పర్వతాల మధ్య కారు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఘటనలో ఆనందరెడ్డి, కావ్యారెడ్డి, మరో ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

కాగా,  కారు లోయలో పడటాన్ని గమనించిన మనీషా వెంటనే డోరు తీసుకుని రోడ్డుపైకి దూకేసింది. దీంతో ఆమె చెయ్యి విరిగి తల పగిలింది. పరిస్థితి కొంత విషమంగా ఉంది.  సమాచారం అందుకున్న మృతుల తల్లిదండ్రులు హుటాహుటిన ఘటనాస్థలానికి బయలుదేరి వెళ్లారు. శనివారం ఉదయం మృతదేహాలు  స్వస్థలాలకు చేరుకుంటాయని బంధువులు తెలిపారు.   

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)