Breaking News

‘బాధ్యత తెలియదని అలా మాట్లాడాను.. ఇలా చేస్తారని ఊహించలేదు’

Published on Thu, 02/23/2023 - 08:39

తిరువళ్లూరు(తమిళనాడు): పనికి వెళ్లడం లేదని బంధువుల ముందు మామ మందలించడం.. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టడంతో అవమాన భారంగా భావించిన ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కాంచీపురం జిల్లా వాలాజాబాద్‌ సమీపంలోని అయ్యంపేటకు చెందిన కలైఅరసన్‌ (37) క్యాటరింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.

ఇతనికి తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ తిరుమేణి పంచాయతీ వసినంపట్టు గ్రామానికి చెందిన విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె నిత్య(30)తో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి కుమారుడు హేమనాథ్‌ (06) ఉన్నాడు. క్యాటరింగ్‌ పనుల ద్వారా  కలైఅరసన్‌కు సరైన ఆదాయం రాకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. దీంతో భార్య కుమారుడితో కలిసి మూడు నెలల క్రితం అత్తారింటికి వచ్చాడు. అప్పటి నుంచి ఖాళీగా ఉన్నాడు.

రెండు రోజుల క్రితం నిత్య తండ్రి లోకనాథన్‌ తన బంధువుల ముందు అల్లుడిని పనులకు వెళ్లాలని మందలించాడు. అప్పటి నుంచి కలైఅరసన్‌ మనస్తాపంతో ఉన్నాడు. దీనికి తోడు అప్పులు చెల్లించాలని ఒత్తిడి పెరగడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.  పురుగుల మందును మొదట కుమారుడికి ఇచ్చారు. అనంతరం నిత్య, కలైఅరసన్‌ సైతం పురుగుల మందును తాగి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించి మప్పేడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్‌ఐ శక్తివేల్‌ మృతదేహాలను తిరువళ్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఖాళీగా ఉంటే బాధ్యత తెలియదని అలా మాట్లాడానని.. ఇంత పనిచేస్తారని ఊహించలేదని మామ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
చదవండి: ‘నా లక్ష్మిని లోకంలో లేకుండా చేశాను’.. వీడియో రికార్డు చేసి.. చివరికి బిగ్‌ ట్విస్ట్‌

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)