కోరిక తీర్చాలని బావ ఒత్తిడి తెచ్చాడు.. అందుకే చంపేశా

Published on Tue, 02/14/2023 - 10:36

వరంగల్: మరదలి ప్రవర్తన సరిగా లేకపోవడంతో మందలించిన బావను నమ్మించి మరో ఇద్దరి సాయంతో హత్య చేసింది. మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ శివారు మున్నేరువాగు సమీపంలో గత శుక్రవారం కుళ్లిన స్థితిలో లభ్యమైన గుర్తు తెలియని మృతదేహం మిస్టరీలో సోమవారం కొత్త విషయం వెలుగుచూసింది. మరదలిపై అనుమానంతో తండావాసులు నిలదీయడంతో నిజం ఒప్పుకుంది. దీంతో కోపోద్రిక్తులైన తండావాసులు ఆమె మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. వివరాల్లోకి వెళ్తే.. డోర్నకల్‌ పట్టణ శివారు సిగ్నల్‌తండాకు చెందిన బానోత్‌ జగన్‌(30) ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించడం లేదు. 

అవివాహితుడైన జగన్‌ హైదరాబాద్‌లో క్యాటరింగ్‌ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగా ఈ నెల ఒకటవ తేదీన తండాకు వచ్చాడు. జగన్‌ సోదరుడు గోపి ఆరేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అతని భార్య తన ఇద్దరు పిల్లలను ఇతర ప్రాంతాల్లో పాఠశాలలో చదివిస్తూ తను ఒంటరిగా తండాలో ఉంటుంది. మరదలి ప్రవర్తన సక్రమంగా లేకపోవడంతో జగన్‌ తరచూ మందలించేవాడు. ఈ నెల 2వ తేదీ రాత్రి నుంచి జగన్‌ కనిపించకపోవడంతో సోమవారం తండావాసులు తన మరదలిపై అనుమానంతో గట్టిగా నిలదీశారు. దీంతో జరిగిన విషయాన్ని తండావాసులకు వివరించింది. 

తన ప్రవర్తనపై బావ జగన్‌ తరచూ ప్రశ్నించేవాడని, తన కోరిక తీర్చాలని ఒత్తిడి తెచ్చేవాడని తెలిపింది. తనను ఇబ్బందులకు గురి చేస్తున్న జగన్‌ అడ్డు తొలగించుకోవాలని తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తితోపాటు మరొకరి సహాయం తీసుకున్నట్లు తెలిపింది. 2వ తేదీ రాత్రి కోరిక తీరుస్తానంటూ మున్నేరు శివారు శివాలయం సమీపానికి తీసుకెళ్లానని, అప్పటికే తన సమాచారం మేరకు అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులతో కలిసి బండరాళ్లతో తల, మెడపై కొట్టి చంపినట్లు ఒప్పుకుంది. దీంతో కోపోద్రికులైన తండావాసులు సదరు మహిళకు దేహశుద్ధి చేశారు. మెడలో చెప్పులదండ వేసి తండాలో ఊరేగించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)